హైదరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో డీసీఎంను ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుకావడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
మృతులను కుంట్లూరుకు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రినాథ్ రెడ్డి (24), చుంచు వర్షిత్ రెడ్డి (23)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డిని చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని సీసీ కెమెరా దృశ్యాల ద్వారా ప్రాథమికంగా నిర్థారించారు.