గత నెల రోజుల నుండి ప్రారంభమైన శ్రీ సమ్మక్క సారలమ్మల జాతర మహోత్సవ కార్యక్రమం.. అధికారికంగా ఫిబ్రవరి 18 నుండి 24 వరకు జరగనున్నదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా వనదేవతలు పూర్తిగా గద్దెల పైకి చేరుకొని భక్తులకు దర్శనమిచ్చే మహా ఘట్టం ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరుగుతుంది. ముఖ్యంగా సమ్మక్క, సారలమ్మ వనదేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. తిరిగి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తల్లులు వన ప్రవేశం చేయడంతో శ్రీ సమ్మక్క సారలమ్మల మహా జాతర ముగుస్తుంది.