అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత కరెంటు మూడు గంటలు మాత్రమే చాలునడంపై ఎమ్మెల్యే సండ్ర తీవ్రంగా మండిపడ్డారు. నిరసన తెలుపుతూ సత్తుపల్లిలో క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ పై ర్యాలీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇస్తున్నటువంటి 24 గంటల ఉచిత కరెంట్ ను మూడు గంటలకు కుదిస్తామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
తెలంగాణ వస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వేళన చేసిందని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా అనడంపై కాంగ్రెస్ పార్టీకి రైతులపై ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. 24 గంటలు ఉచిత కరెంటు ద్వారా వెలుగు తో తెలంగాణ రాష్ట్రం వెలుగుతుంది అని దేశానికి తిండి గింజలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని ఆ పార్టీ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది మీరు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. మీరు పాలిస్తున్న ఏ రాష్ట్రాల్లో తెలంగాణా రాష్ట్రం ఇస్తున్న పథకాలు ఇస్తున్నారు అంటూ ప్రశ్నించారు.. సీటు పై ఉన్న శ్రద్ధ పరిపాలనపై ప్రజలపై లేదని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.