Saturday, May 18, 2024
HomeతెలంగాణSangareddy: టికెట్ ఇస్తానని మోసం చేసిన బి ఆర్ఎస్

Sangareddy: టికెట్ ఇస్తానని మోసం చేసిన బి ఆర్ఎస్

గులాబీ పార్టీకి బీరా యాదవ్ గుడ్ బై

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రావడానికి అహర్నిశలు కృషిచేసిన వ్యక్తికి జండా మోసిన నాయకులకు గులాబీ పార్టీలో గుర్తింపు లేదని సీనియర్ లీడర్ వీర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
2001 సంవత్సరం నుండి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు బీరయ్య యాదవ్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది.

- Advertisement -

అయితే మెదక్ ఎంపీ స్థానం నుంచి తన పేరు పరిశీలించాలని అధినేత కెసిఆర్ తో సహా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు పలుమార్లు బీరయ్య యాదవ్ విన్నవించారు. అంతేకాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా మెదక్ ఎంపీ సీటు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి ఇవ్వడంతో బీరయ్య యాదవ్ నిరాశ వ్యక్తం చేశారు.

తాను చాలా రోజుల నుంచి మెదక్ ఎంపీ సీటు ఇవ్వాలని కోరానని, అయితే ఎంపీ సీటు ఇచ్చే సమయంలో కూడా అధిష్టానం తనను సంప్రదించలేదని వాపోయారు. టీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం ఎక్కడికి పంపినా వెళ్లి పని చేశానని, ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ఇన్చార్జిగా అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పని చేశానని చెప్పారు. అలాగే పార్టీ కార్యక్రమాలను తూ.చ తప్పకుండా పాటించి ఉమ్మడి మెదక్ – జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు.

ఉద్యమంలో పోలీస్ లాఠీ దెబ్బలను తిన్నానని, ప్రతి నిత్యం పోలీసు నిర్బంధాలను ఎదుర్కొన్నానని అన్నారు. ఆఖరికి జైలుకు కూడా వెళ్లానని, తెలంగాణా రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంతో పని చేశానని చెప్పారు. తనకు ఇప్పటి వరకు పార్టీ ఎలాంటి పదవులు ఇవ్వలేదని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ ను ఇచ్చి ఆశీర్వదించాలని పలుమార్లు కేసీఆర్ తో పాటు కేటీఆర్ని, హరీష్ రావులను వేడుకున్నానని చెప్పారు.

తెలంగాణ ఉద్యమకారునిగా బీసీ నేతగా, సెక్యూలర్ నేతగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని, దీనితో పాటు అన్ని వర్గాల మద్దతు ఉందని, బీసీ నినాదంతో మెదక్ బరిలో నిలిచి ఉంటానని బీరయ్య యాదవ్ తెలిపారు. అయితే బుధవారం నాడు తన కార్యాచరణ ప్రకటిస్తానని బీరయ్య యాదవ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News