మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, క్రిటికల్ కేర్,ఇతర నిర్మాణ పనులను మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంకా ఏవైనా నిధులు అవసరం ఉంటే మంజూరు చేయిస్తానని, నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలని కాంటాక్టర్లకు పలు సూచనలు చేశారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా. రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, మార్నేని వెంకన్న, యాళ్ల మురళీధర్ రెడ్డి, కర్పూరపు గోపి, కొండ్ర ఎల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.