Saturday, November 23, 2024
HomeతెలంగాణSeethakka: మణిపూర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, మోడీ రాజీనామా చేయాలి

Seethakka: మణిపూర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, మోడీ రాజీనామా చేయాలి

మైనింగ్ కోసం మహిళలపై దాడులా?

మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహించి అక్కడ ప్రభుత్వాన్ని వెంటనే రద్దుచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు మహిళపై దాడులు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అదాని ఆస్తులు పెంచుకోవడం కోసం మణిపూర్లో 53వేల ఎకరాలలో మైనింగ్ కోసం అక్కడి మహిళలపై విచక్షణా రహితంగా కొడుతూ నగ్నంగా ఊరేగిస్తూ చంపేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేంద్ర గౌడ్, ఎండి. అయూబ్ ఖాన్, వంగ రవి యాదవ్, కంబాల రవి, బానోతు రవిచందర్, వెంకన్న,బైరెడ్డి భగవాన్ రెడ్డి, పాలడుగు వెంకట కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News