ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ లో 2022 లోనే ఇథనాల్ ఫ్యాక్టరీ కి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది అని మంత్రి సీతక్క (Seethakka) వెల్లడించారు. ఐటీ మంత్రిగా కేటిఆర్ గ్రామ సభ పెట్టకుండా కేసీఆర్ సంతకంతో పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. గ్రామసభ నిరవహించకుండా పర్మిషన్ ఎలా ఇస్తారని సీతక్క బీఆర్ఎస్ ని ప్రశ్నించారు. త్వరలో కేసీఆర్ సంతకాలతో ఉన్న ఆధారాలు అన్నీ బయట పెడతామన్న సీతక్క… అసెంబ్లీ లో స్వీకర్ ముందు చర్చ కూడా పెడతామని స్పష్టం చేశారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ పర్మిషన్ కి బీజేపీ కూడా మద్దతు తెలిపిందని సీతక్క (Seethakka) ఆరోపించారు. ఇథనాల్ కంపెనీ డైరెక్టర్లుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు, తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్ కొడుకు ఉన్నారన్నారు. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్పూర్ రావాలి అని డిమాండ్ చేశారు. నేను కూడా అక్కడికి వస్తా.. ఎవరు పెర్మిషన్ ఇచ్చారో తేలుద్దాం అంటూ సీతక్క సవాల్ విసిరారు.