Saturday, November 23, 2024
HomeతెలంగాణSeethakka: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఖాళీల భర్తీ

Seethakka: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఖాళీల భర్తీ

ఉపాధి ఇస్తామంటున్న సీతక్క

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ…ఎమ్మెల్యే సీతక్క హామీ ఇచ్చారు. క్యాంప్ కార్యాలయంలో బి ఆర్ఎస్ పార్టీకి చెందిన 20 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, ఇల్లు కట్టుకునే పేదలకు ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయల సాయంతో పాటు ఆరోగ్య శ్రీ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. రైతులకు ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయాలకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామని అన్నారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి కూనురు అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News