Sunday, October 6, 2024
HomeతెలంగాణShabad: అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్, పట్నం

Shabad: అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్, పట్నం

పరిశ్రమల ఖిల్లా రంగారెడ్డి జిల్లా

షాబాద్ మండలం సీతారాంపురం, చందనవెల్లి పారిశ్రామిక వాడల్లో 1770 కోట్ల పెట్టుబడులతో చేపట్టనున్న సింటెక్స్, కీ టెక్స్ పరిశ్రమల యూనిట్లకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీ రామారావు, మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య , కలెక్టర్ హరీష్, టిఎస్ఐఎసి ఎండి వెంకట్ నరసింహారెడ్డి, వెల్స్పన్ అధినేత బాలకృష్ణ గోయంక, కిటెక్స్ జాకబ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేందర్ రెడ్డి ..సీఎం కేసీఆర్ దిశా నిర్ధేశంలో ముందుకు సాగుతున్నామని, తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శమన్నారు. కేటీఆర్ కృషితో దేశ, విదేశీ పెట్టుబడిదారులు వారి పెట్టుబడులు వరదలా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయన్నారు.

- Advertisement -

రంగారెడ్డి జిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారిందని… వేల మందికి ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాల వచ్చాయన్నారు మంత్రి పట్నం. ప్రపంచ చిత్రపటంలో షాబాద్ మండలానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని.. 370 కోట్లతో సింటెక్స్ పరిశ్రమలో 1000 మందికి ఉద్యోగ కల్పించబోతోందన్నారు మంత్రి. 1400 కోట్ల పెట్టుబడులతో కీటెక్స్ పరిశ్రమలో 12వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు.. రంగారెడ్డి జిల్లాలో 1358 పరిశ్రమలు 62 వేల 832 కోట్ల పెట్టుబడులతో స్థాపించబడగా వీటిలో 7 లక్షల 6000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని.. వికారాబాద్ జిల్లాలోను అనువైన ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో కలిసి భారీ పరిశ్రమల స్థాపన కోసం సీఎం కేసీఆర్ కు నివేదిస్తామన్నారు పట్నం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News