Friday, September 20, 2024
HomeతెలంగాణShadnagar: షాద్నగర్ వైద్య సేవలు షాన్ దార్

Shadnagar: షాద్నగర్ వైద్య సేవలు షాన్ దార్

ఎమ్మెల్యే చొరవతో బ్లడ్ బ్యాంకు, డయాలసిస్ సెంటర్

నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు.. అనే పరిస్థితి ఒకప్పుడు అంతటా ఉండేది.. షాద్ నగర్ కూడా అందుకు అతీతం కాదు.. అందుబాటులో లేని వైద్యులు.. తెల్ల మందు తప్ప కనిపించని ఇతర సేవలు.. చిన్న ప్రమాదం జరిగినా హైదరాబాదుకు సిఫార్సులు.. ఇది ఒకప్పుడు పరిస్థితి.. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది.. అన్ని సేవలను ఇక్కడికి అందుబాటులోకి తెచ్చిన షాద్ నగర్ కమ్యూనిటీ హాస్పటల్ ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ప్రభుత్వపరమైన సేవలు అన్నింటిని ఇక్కడ నూటికి నూరుపాళ్ళు పాటిస్తూ రోగులకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. స్ధానిక ఎమ్మేల్యే వై. అంజయ్య యాదవ్ హాయంలో వైద్య రంగానికి నియోజకవర్గంలో మహర్దశ లభించింది. ఒకసారి షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రి మొదలుకొని ప్రతి పల్లెలో అందుతున్న వైద్యం భవిష్యత్ వైద్య ప్రణాళిక తదితర అంశాలను పరిశీలిస్తే అబ్బుర పడక తప్పదు. నియోజక వర్గం వ్యాప్తంగా వైద్య సేవలను ఓసారి పరిశీలిస్తే.. దొరకునా ఇటువంటి సేవ.. అన్న రీతిలో షాద్ నగర్ కమ్యూనిటీ హాస్పిటల్ దూసుకుపోతోంది.. ప్రస్తుతం పాత జాతీయ రహదారి పక్కన లింగారెడ్డి గూడా సమీపంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ 21 కోట్లు పెట్టి నూతనంగా కమ్యూనిటీ ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న హాస్పిటల్లో సేవలు ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఆసుపత్రి పరిధిలో 33 పల్లె దవఖానాలు, ఒక యుపిహెచ్ సి, ఒక బస్తీ దవఖాన ఉన్నాయి. కమ్యూనిటీ ఆసుపత్రిలో ఇటీవలనే 60 లక్షలు వెచ్చించి డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రామా కేర్ సెంటర్ ను 11.51 కోట్లతో ఏర్పాటు చేయబోతుండటం విశేషం. దీనివల్ల వైద్యం ప్రజలకు మరింత చేరువైంది. ప్రతి చిన్న దానికి రాజధాని వైపు చూడకుండా పరీక్షలు, సేవలు ఇక్కడే జరగడం నిరుపేద రోగులకు ఎంతో ఉపయోగకరంగా మారిన అంశం. మరోవైపు ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు ను కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ఈ ప్రాంతంలో అత్యవసరం కోసం బ్లడ్ బ్యాంక్ అవసరం ఎంతైనా ఉంది. దీని ఏర్పాటు విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వెలుగు చూడవయ్యా.. వెలుగు చూపరయ్యా అంటూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రజల వద్దకు కంటి వెలుగు రూపంలో ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనిని గ్రామ గ్రామాన అమలయ్యేలా ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ స్వయంగా పర్యవేక్షిస్తూ పనులు చేస్తున్నారు. కంటి వెలుగు సంబంధించి మొదటి దశలో 1,71,57 7 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. అందులో 29 మందికి రీడింగ్ గ్లాసెస్, అదేవిధంగా 1636 మందికి ప్రిస్ ఫిక్షన్ గ్లాసెస్ ను అందజేయడం జరిగింది. ఇక రెండవ దశకు వచ్చేసరికి 2,23,576 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షలలో రెండో విడత 34,638 మందికి రీడింగ్ గ్లాసెస్, 1956 మందికి ప్రిస్ ఫిక్షన్ గ్లాసెస్ ను అందజేశారు. ఈ కంటి వెలుగు కార్యక్రమం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని నిరుపేద గ్రామస్తులు అంటున్నారు. కోవిడ్ సేవలు అసమానం.. ఇక కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందించిన సేవలు అసమానంగా చెప్పుకోవాలి.

ఆపదలో ఉన్న వారి కోసం ఆక్సిజన్ సిలిండర్లు, ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడగలిగారు. అంతేకాకుండా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేయడం, ముఖ్య కూడళ్లలో భోజనాల వసతులు కల్పించడం లాంటివి చేపట్టారు. కరోనా సమయంలో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఎంతో మందిని సకాలంలో ఆసుపత్రిలో చేర్చి వారి ప్రాణాలను కాపాడారు. రెమడీసివిర్ ఇంజక్షన్లు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తెప్పించి షాద్ నగర్ లో అవసరం ఉన్న రోగులకు అందజేశారు. ఈ సేవలన్నీ ఎమ్మేల్యే అంజయ్య స్వంతంగా సామాజిక సేవల్లో భాగంగా చేయటం విశేషం. ప్రస్తుతం నూతనంగా నిర్వహిస్తున్న ఆసుపత్రి అత్యాధునిక వసతులతో రూపొందుతుందని, ఈ ఆసుపత్రి పూర్తయ్యాక అన్ని రకాల వైద్య సేవలను ఇక్కడ ప్రజలకు అందిస్తామని వైద్యాధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News