సింగరేణి ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న ప్రతిఒక్కరూ వేసవికాలన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని సింగరేణి హెల్త్ ఆఫీసర్ లోక్నాథ్ రెడ్డి సూచించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గని ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… వేసవి కాలంలో వడదెబ్బపై, నివారణ చర్యల గురించి ఉద్యోగస్థులకు అవగాహన కల్పించారు. కార్మికులు ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ జాగ్రత్తగా పాటించాలని, మద్యపానం, ధూమపానం, మాంసాహారం అతిగా తీసుకోకుండా కూరగాయలు, పండ్లకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ తిరుపతి, రక్షణాధికారి శ్రీనివాస్, ఇంజనీర్ మహేష్, డిప్యూటీ మేనేజర్ కొమురయ్య, గుర్తింపు సంఘం నాయకులు ఇప్ప భూమయ్య తదితరులు పాల్గొన్నారు.