Friday, November 22, 2024
HomeతెలంగాణSingareni: కార్మికుల పిల్లలు సింగరేణికి మంచి గుర్తింపు తేవాలి

Singareni: కార్మికుల పిల్లలు సింగరేణికి మంచి గుర్తింపు తేవాలి

సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల పిల్లలు ఉన్నత చదువులు చదివి సింగరేణి సంస్థకు మంచి పేరు, గుర్తింపు తీసుకురావాలని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ బి.సంజీవరెడ్డి అన్నారు. ఆర్కే-6 గనిలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రాధాకృష్ణ కుమారుడైన వ్యాసభట్ నిఖిల్ కృష్ణ తిరుపతి ఐఐటి లో సివిల్ ఇంజనీర్ తృతీయ సంవత్సరం చదువుతున్న అతనికి 1లక్ష 10వేల 100 రూ/- అదేవిధంగా ఇందారం ఉపరితల గనిలో ఈపీ ఆపరేటర్ గా పని చేస్తున్న ఆవుల కొమురయ్య కుమార్తె ఆవుల ఆకాంక్ష హైదరాబాదులోని గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ రూ. 10వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిఎమ్ మాట్లాడుతూ… సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతతో పాటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్ ను అందజేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఉన్నత చదువులు చదివి సంస్థకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. దేశ విదేశాల్లో సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు వివిధ హోదాలలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడం సంతోషకరమైన విషయమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎమ్ త్యాగరాజు, డీజీఎమ్ పర్సనల్ అరవింద రావు, డీజీఎమ్ సివిల్ శివరావు, ఏరియా రక్షణాధికారి శ్రీధర్, ఏరియా వర్క్ షాప్ డీజీఎమ్ చంద్రశేఖర్ రెడ్డి, పర్సనల్ మేనేజర్ కాంతారావు, ఫిట్ కార్యదర్శి పివి రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News