Saturday, November 23, 2024
HomeతెలంగాణSingareni: ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళికలు

Singareni: ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళికలు

వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సింగరేణి ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ జి.వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని భూ ఉపరితల గని ఏరియా జిఎమ్ బి.సంజీవరెడ్డి తో కలిసి సందర్శించి గని ప్లానింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాలను వీలైనంత తొందరగా సాధించడానికి, తగిన ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. భూ ఉపరితల గని క్వారీలో పని ప్రదేశాలను పరిశీలించి రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదక సాధించటానికి ఉద్యోగులందరూ వ్యక్తిగత రక్షణను పాటించాలని సూచించారు. ఓబి కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ… రోజువారి నిర్దేశిత ఓబి లక్ష్యాలను సాధించాలని, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని క్వారీలో నీరు నిల్వ ఉండకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బొగ్గు రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి వి.పురుషోత్తం రెడ్డి, ఇంచార్జ్ గని మేనేజర్ ఐ.శ్రీనివాస్, ప్రాజెక్టు ఇంజనీర్ చంద్రశేఖర్, సంపత్, సెక్యూరిటీ అధికారి మురళి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News