Saturday, October 5, 2024
HomeతెలంగాణSirisilla: సిరిసిల్ల జిల్లాలో భూకబ్జా దారులపై ఉక్కుపాదం

Sirisilla: సిరిసిల్ల జిల్లాలో భూకబ్జా దారులపై ఉక్కుపాదం

ప్రజలు ధైర్యంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భూ సమస్యల్లో జోక్యం చేసుకొని భూ కబ్జాలకు పాల్పడుతూ, నకిలీ భూ పత్రాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్న తంగళ్ళపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు దైర్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

- Advertisement -

భూమి లేకున్నా ఉన్నట్టు నమ్మించి..

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలోని లక్ష్మీపూర్ శివారులో గత 45 సంవత్సరాల క్రితం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గుర్రం అంజయ్య కొనుగోలు చేసిన భూమిలో వ్యవసాయం చేసుకుంటుండగా తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన కోడి అంతయ్య అనే వ్యక్తి అట్టిని భూమిని అక్రమించాలనే ఉద్దేశంతో గుర్రం అంజయ్యను, కుటుంబ సభ్యులను బెదిరించి కొంత భూమిని కబ్జా చేసినందుకు అతనిపైన కేసు నమోదు చేశామని, తంగళ్ళపల్లి శివారులోని శోభ అనే మహిళ యొక్క భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వారి భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన కోడి అంతయ్యపైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భూమి లేకున్నా ఉన్నట్టు నమ్మించి మోసం చేసిన వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. తంగళ్ళపల్లి మండలంలోని అంకుషాపూర్ దారిలో గల సర్వేనెంబర్ 160 లో ఉన్నటువంటి రెండు గుంటల భూమి తన పేరున లేకపోయినా ఉన్నదని నమ్మించి చిలుక శ్రీనివాస్ అనే వ్యక్తితో ఒప్పందం చేసుకొని అతని వద్ద నుండి 8 లక్షల 40 వేల రూపాయలు తీసుకున్న వట్టిమల్ల శ్రీనివాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.జిల్లాలో భూ కబ్జాలు చేస్తూ, నకిలీ భూ పత్రాలు సృష్టించి బెదిరింపులకు పాల్పడే వారి సమాచారం, వారి నేర ప్రవృత్తి గురించి ప్రజలు ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News