వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు ఓసిపీలతోనే సాధ్యమని శ్రీరాంపూర్ జిఎం బి. సంజీవరెడ్డి అన్నారు. తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. సింగరేణి సంస్థ నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఓసిపిల ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. వార్షిక ఉత్పత్తి లక్ష్యాలలో శ్రీరాంపూర్ కు ఏప్రిల్ మాసానికి నిర్దేశించిన 6,26,500 ఉత్పత్తి లక్ష్యానికి 3,73,131 టన్నులు సాధించి 60 శాతం తో ముందుకు సాగుతుందని అన్నారు. శ్రీరాంపూర్ ఇందారం, ఓపెన్ కాస్ట్ 4,90,000 ఉత్పత్తి లక్ష్యానికి 2,41731 టన్నుల తో 49 శాతం, భూగర్భగంలో 1,36,500 లక్ష్యానికి 1,31,400 ల టన్నులతో 96 శాతం ఉత్పత్తి సాధించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆర్కే-5, గని 106 శాతం, ఆర్కె6 గని 116 శాతం, ఆర్క-7 గని 99 శాతం, ఆర్కే న్యూ టెక్ 95 శాతం, ఎస్ ఆర్ పి వన్ గని 90 శాతం, ఎస్ ఆర్ పి 3 గని 89 శాతం, ఇందారం వన్ గని 80 శాతం ఉత్పత్తి సాధించడం జరిగిందని వివరించారు. అదేవిధంగా శ్రీరాంపూర్ లో 49 మంది ఉద్యోగులకు కారుణ్య నియామక పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు. శ్రీరాంపూర్ లో రెండు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. చెన్నూరులో 24 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చే యనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎస్ ఓ టు జిఎం గోపాల్ సింగ్, డీజీఎం అరవింద రావు, డీజీఎంఐఈడి చిరంజీవులు, ఆర్కే-5,6 గ్రూప్ ఏజెంట్ ఏవి రెడ్డి, పిఓ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.