ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బయ్యా సన్నీ యాదవ్(Sunny Yadav)పై నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అతడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడు. ఇప్పటికే పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో అరెస్ట్ కావడం ఖాయమని భావించిన సన్నీ.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు.
మరోవైపు ఇదే కేసుకు సంబంధించి యాంకర్ శ్యామల కూడా హైకోర్టును ఆశ్రయించగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు మాత్రం హాజరుకావాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన విశాఖకు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.