Friday, November 22, 2024
HomeతెలంగాణTandur: గుంతలు తవ్వారు, పూడ్చడం మరిచారు

Tandur: గుంతలు తవ్వారు, పూడ్చడం మరిచారు

నెల రోజుల క్రితం తవ్విన గుంతలు

నీటి సరఫరా కోసం పైపులైన్లు వేసే క్రమంలో ఎంతో నాణ్యతగా ఉన్న రోడ్లను తవ్వి నాశనం చేశారని స్థానికులు అంటున్నారు. తాండూరు పట్టణంలోని వినాయక్ చౌక్ సమీపంలో మోర్ సూపర్ మార్కెట్ వద్ద నెల రోజుల క్రిందట నీటి సరఫరా పైప్ లైన్ డ్యామేజ్ అయిందని మరమ్మతుల కోసం తొవ్విన గుంతను రోజులు గడుస్తున్నా పూడ్చడంలో కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులు పట్టించుకోక పోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటునట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, దుకాణాల యజమానులు మాట్లాడుతూ నీటి సరఫరా పైప్ లైన్ డామేజ్ అయిందని తొవ్విన గుంతను పునర్నిర్మించక పోవడం వల్ల ప్రధాన రోడ్డు పై వచ్చే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. గుంతలను నడిరోడ్డు పైన త్రవ్వి అలాగే ఉంచడం వల్ల, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, రాత్రి వేళల్లో ఆ గుంతలో పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, వెంటనే గుంతలను పూడ్చి వేయాలని, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులు పట్టించుకొని గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News