Sunday, November 16, 2025
HomeతెలంగాణTDP: తెలంగాణలో రీఎంట్రీకి టీడీపీ భారీ స్కెచ్..!

TDP: తెలంగాణలో రీఎంట్రీకి టీడీపీ భారీ స్కెచ్..!

ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి(TDP) తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ ఏపీకే పరిమితం కావడం.. టీడీపీ కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో క్యాడర్ కూడా సైలెంట్ అయిపోయింది. కానీ ఇప్పటికీ టీడీపీకి తెలంగాణలో కార్యకర్తలు ఉన్నా.. వారికీ దిశానిర్దేశం చేసే నాయకులు లేరు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

- Advertisement -

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ నాయకులతో భేటీ అయిన చంద్రబాబు పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తామన్నారు. ఇప్పుడు ఆ దిశగా పెద్ద స్కెచ్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో రీఎంట్రీకి సర్వం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.

ఇప్పటికే రాజకీయ వ్యూహాకర్తలు ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishor), రాబిన్ శర్మ (Rabin Sharma)లతో చంద్రబాబు, నారా లోకేశ్‌ (Nara lokesh) భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణలో టీడీపీ బలోపేతంపై పలు ప్రణాళికలను ప్రశాంత్, రాబిన్ ‌శర్మ వారికి అందజేసినట్లు సమాచారం. మహబూబ్ నగర్ నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారట. కాగా ఇప్పటికే ఇతర పార్టీలోకి వెళ్లిన మాజీలు మళ్లీ సొంత గూటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad