తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో(Raj Bhavan) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీఎస్, డీజీపీ, పలువురు అధికారులు హాజరయ్యారు. వీరితోపాటు నిర్మాత దిల్‌రాజు దంపతులు, మిస్ వరల్డ్ ఓపల్ సుచాత(థాయ్‌లాండ్), తొలి రన్నరప్ హాసెట్ డెరెజే(ఇథియోపియా), రెండో రన్నరప్ మయా క్లైడా(పోలాండ్), మూడో రన్నరప్ ఆరేలి జోచిమ్(మార్టినిక్) కూడా తేనీటి విందులో పాల్గొన్నారు.
Raj Bhavan: రాజ్‌భవన్‌లో తేనీటి విందు.. హాజరైన సీఎం, మిస్ వరల్డ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


