అక్రమార్కులపై తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (Telangana ACB) ఉక్కుపాదం మోపుతోంది. లంచం తీసుకుంటున్నారనే సమాచారం అందితే పక్కా ప్లాన్ వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. ఈ క్రమంలో గురువారం లంచం తీసుకుంటోన్న ఒక అధికారిని సాక్ష్యాధారాలతో బుక్ చేసింది. వివరాల్లోకి వెళితే…
Also Read: ఫార్ములా ఈ రేస్ ఆరోపణలపై స్పందించిన KTR
మహబూబ్ నగర్ జిల్లా డైట్ కాలేజ్ లెక్చరర్, డీఈవో ఆటి రవీందర్ ఒక వ్యక్తి నుండి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి తన భార్యకి దక్కవలసిన పదోన్నతి దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈఓ రవీందర్ కి విజ్ఞప్తి చేశాడు. అందుకు డీఈవో 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో.. ఫిర్యాదుదారుడు తెలంగాణ ఏసీబీ (Telangana ACB) డీఎస్పీ కృష్ణ గౌడ్ ను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈవో ఇంటికి వెళ్లిన ఫిర్యాదుదారుడు 50 వేల రూపాయలు ఇస్తుండగా… డీఎస్పీ కృష్ణ గౌడ్ బృందం డీఈఓను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీఈవో రవీందర్ నుంచి 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.