తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు రంగం సిద్ధమైంది. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 5 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశమున్నట్టు సమాచారం. బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేసేందుకు ఈ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆ తరవాత మార్చి 10 వ తేదీన ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వెళ్లి బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది.