Sunday, November 16, 2025
HomeతెలంగాణTG Weather Updates: నేటి నుంచి మళ్ళీ వర్షాలు ప్రారంభం.. ఏ ఏ ప్రాంతాల్లో అంటే..!

TG Weather Updates: నేటి నుంచి మళ్ళీ వర్షాలు ప్రారంభం.. ఏ ఏ ప్రాంతాల్లో అంటే..!

Today Rain In TG: తెలంగాణలో మళ్ళీ నేడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మొదలవుతాయని వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత వారమంతా ఉన్న ఈదర గాలులు నేటి నుంచి తగ్గుముఖం పట్టనున్నట్లు తెలిపారు. తూర్పు, ఉత్తరం, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా సాయంత్రం నుంచి రాత్రి సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. అయితే నేడు విస్తృత తుఫానులను మాత్రం ఆశించవద్దన్నారు. ప్రస్తుతం రాష్ట్రం వర్షపాతం లోటుతో సతమతమవుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది అన్నదాతలకు పెద్ద ఊరటనిచ్చే వార్త.

- Advertisement -

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాల సూచనలు:

నేడు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా, బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ వర్షాలు సాగునీటి అవసరాలను తీర్చి, పంటలకు జీవం పోస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఆలస్యమైనా, మంచి వర్షాలు కురిస్తే దిగుబడులు మెరుగుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వర్షపాతం లోటుతో రైతుల ఆందోళన:

ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జూన్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై మొదటి వారం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో చాలాచోట్ల వేసిన పత్తి, వరి వంటి పంటలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు మొలకెత్తడానికి కూడా కష్టతరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పెట్టుబడులు పెట్టినా, సరైన వర్షాలు లేకపోవడంతో పంటల భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. బోర్‌లలో నీటి మట్టాలు కూడా గణనీయంగా తగ్గిపోవడంతో సాగునీటి కొరత మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన భారీ వర్ష సూచన రైతన్నలకు ఒక ఆశాకిరణంగా మారింది.

జూలై 17-22: హైదరాబాద్ నగరంతో సహా దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రాంతాలలో తీవ్రమైన ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొన్నారు.

జూలై 23-28: వరుసగా అల్పపీడనాలు కారణంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో ముసురుతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రుతుపవనాల విచ్ఛిన్నం కారణంగా తెలంగాణలో నేడు కూడా వర్షాలు ఉండవని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు నిన్ననే తెలిపారు.  అనేక ప్రాంతాల్లో వాతావరణమంతా వేడి, తేమతో కూడి ఉంటుందని పేర్కొన్నారు. అయితే జూలై 16 తర్వాత వచ్చే భారీ వర్షాలకు సిద్ధంగా ఉండాలని మంచి కబురు చెప్పినప్పటికీ.. ప్రస్తుతం ఎల్లుండి నుంచి హైదరాబాద్ నగరంతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా కురవనున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో మాన్ సూన్ వర్షాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. జూలై 17 తర్వాత తెలంగాణలో వర్షాలు పుంజుకుంటాయి అని చెబుతున్నా.. నేడు రేపు మాత్రం ఎండలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంది. అయినప్పటికీ, ఈ రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్ర సగటు వర్షపాతం సాధారణ స్థాయి కంటే స్వల్పంగా తక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad