Saturday, November 23, 2024
HomeతెలంగాణThalasani: గ్రేవ్ యార్డ్ ను అత్యంత సుందరంగా నిర్మిస్తాం

Thalasani: గ్రేవ్ యార్డ్ ను అత్యంత సుందరంగా నిర్మిస్తాం

సనత్ నియోజకవర్గ పరిధిలోని ఈఎస్ఐ గ్రేవ్ యార్డును అత్యంత సుందరంగా నిర్మిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, సీఈ జియాఉద్దీన్ లతో కలిసి గ్రేవ్ యార్డును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10 కోట్ల రూపాయల వ్యయంతో మహాప్రస్థానం కంటే ఎంతో అద్బుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అంత్యక్రియలు నిర్వహించే వేదికలు, అస్తికలను భద్రపరిచేందుకు లాకర్లు, అంత్యక్రియల కోసం వచ్చే వారికోసం ప్రత్యేక భవనాలు, టాయిలెట్స్, వాహనాల పార్కింగ్, గ్రేవ్ యార్డ్ సిబ్బందికి నివాస గృహాల నిర్మాణం వంటి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు గార్డెనింగ్, మొక్కలను నాటడం వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుందని, చెప్పారు. అవసరమైన ప్రణాళికలను పది రోజులలోగా రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డీసీ మోహన్ రెడ్డి, ఈఈ ఇందిర, వాటర్ వర్క్స్ జీఎం హరి శంకర్, ఏఎంఓహెచ్ భార్గవ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు తదితరులు ఉన్నారు.

- Advertisement -

వారం రోజులలో సమస్యను పరిష్కరిస్తాం: మంత్రి

అమీర్‌పేట‌లోని దివ్యశక్తి అపార్ట్ మెంట్ వాసుల సమస్యను వారం రోజులలో పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. దివ్యశక్తి అపార్ట్ మెంట్ పక్కనే ఉన్న నాలాను పరిశీలించారు. నాలాలో ఉన్న వ్యర్ధాలను వెంటనే పూర్తిస్థాయిలో తొలగించి నీరు సాఫీగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరిగి పది రోజుల తర్వాత వచ్చి పనుల పురోగతిని పరిశీలిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News