Saturday, November 23, 2024
HomeతెలంగాణThalkondapalli: ఆ ఫ్రీ ట్యూషన్ తో గురుకుల సీటు పక్కా

Thalkondapalli: ఆ ఫ్రీ ట్యూషన్ తో గురుకుల సీటు పక్కా

ఉచితంగా ట్యూషన్ చెబుతున్న సురేష్

తలకొండపల్లిలో అత్యంత విశిష్టమైన టూషన్ కేంద్రం ఉంది అందులో టూషన్ పొందితే గురుకుల 5వ తరగతి సీటు పక్కాగా ఉంటుంది. గురుకులం 5వ తరగతి ఎంట్రన్స్‌కై తలకొండపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో నిరుపేద కుటుంబానికి చెందిన పేరుమల్ల సురేష్ అనే వ్యక్తి 2020లో మండలంలోని చిన్నారులకు ఉచితంగా టూషన్ అందిస్తూ పేరుగాంచారు. ఆయన ట్యూషన్కెళ్తే 99% అత్యుత్తమ ఫలితాలే…ఉచిత టూషన్ అందించే పెరుమాళ్ల సురేష్‌పై తెలుగుప్రభ ప్రత్యేక కథనం..

- Advertisement -

రంగారెడ్డి జిల్లా మారుమూల ప్రాంతం తలకొండపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ భవనంలో మాజీ గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను స్ఫూర్తిగా తీసుకొని మండల కేంద్రానికి చెందిన యువకుడు పెరుమాళ్ల సురేష్ అక్షరం, ఆంగ్లం, ఆర్థికం అనే సంకల్పంతో 2020లో ఒక ఉచిత టూషన్ కేంద్రం ఎర్పాటు చేసారు. పేద విద్యార్థులను గురుకులంకు పంపాలన్నదే తన సంకల్పంతో పేద విద్యార్థులు ఉన్నత ‌విద్యతో ముందుకు సాగాలన్నదే అతని లక్ష్యం.డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో గురుకుల పాఠశాల కార్యదర్శిగా పనిచేసిన సంగతి తెలిసిందే.. గురుకుల పాఠశాల విద్యార్థులను అత్యున్నత స్థానంలో నిలిపిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌గా చెప్పుకోవచ్చు.

ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తలకొండపల్లి మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన పేరుమల్ల సురేష్ తను ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీలలో చదువుకొని ఎంతో ఇబ్బందులకు గురై తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆర్ఎస్ ప్రవీణ్ ‌కుమార్‌ను స్ఫూర్తిదాయకంగా తీసుకొని తలకొండపల్లి మండలంలో స్వేరోస్ సర్కిల్ 2020లో 18 మందితో ఎర్పాటు చేశారు.2020లో స్వేరో సర్కిల్‌లో ట్యూషన్ పొందిన చిన్నారులలో 16మంది గురుకుల 5వ తరగతి సీట్లు సంపాదించారు. 2021లో 37మంది చిన్నారులు టూషన్ తీసుకుంటే 34మంది విద్యార్థులు సీటు పొందారు. 2022లో 55 మంది విద్యార్థులు స్వేరో సర్కిల్‌లో టూషన్ తీసుకుంటే 52మంది విద్యార్థులు గురుకులంకై ఎంపికయ్యారు. 2023లో 57 మందికీ ట్యూషన్ అందిస్తే 52 మంది చిన్నారులు గురుకులంలో సీటు పొందారు. ప్రస్తుతం 2024లో 5వ తరగతి గురుకులంకై 70 మంది విద్యార్థులు టూషన్ పొంది ఆదివారం గురుకుల ఎంట్రన్స్ రాసారు. తలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుండి చిన్నారుల తల్లిదండ్రులు ఆయన టూషన్ చిన్నారులకు అందించాలని ఎంతో కష్టపడి టూషన్‌కు పంపిస్తున్నారు. ఉదయం 6గంటల‌ నుండి రాత్రి 8 గంటల వరకు స్వేరో సర్కిల్‌లో కమాండర్ పేరుమల్ల సురేష్ ఉచితంగా టూషన్ అందించారు. ఆదివారం ఎంట్రన్స్ రాసిన వారిలో కూడా 60కి పైగా గురుకుల సీట్లు వస్తాయని తన వద్ద టూషన్ పొందిన విద్యార్థులు కచ్చితంగా సీటు సంపాదించడం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.స్వేరో సర్కిల్‌ కమాండర్ సురేష్‌ను తెలుగుప్రభ రిపోర్టర్ ఎందుకు మీరు ఇంతగా చిన్నారుల కోసం ఉచితంగా టూషన్ అందిస్తున్నారంటే ఆయన సమాదానము ఇస్తూ…తన పడ్డా బాద తన పేదరికం ఎంతో బాధకు గురిచేసిందనీ అలాంటి ఇబ్బందులు పేద మద్యతరగతి కుటుంబంలో రాకూడదనీ తన విజ్ఞానాన్ని చిన్నారులకు ఉచితంగా అందిస్తున్నననీ పేర్కొన్నారు.

పేద విద్యార్థులు ఉన్నతంగా చదవాలన్నదే తన సంకల్పంగా చెప్పుకోచ్చారు. ఈ టూషన్ కేంద్రానికి కొంతమంది నాయకులు వచ్చి చిన్నారులకు చీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ట్యూషన్ అందిస్తున్న పేరుమల్ల సురేష్‌ను మండలంలోని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇలాంటి గొప్ప స్పూర్తిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని అశిస్తున్నారు. ఇలా ఉచితంగా టూషన్ అందిస్తున్న పేరుమల్ల సురేష్‌ను అభినందిస్తూ ఇలాగే ముందు సాగాలనీ, ఇలాంటి టూషన్ సర్కిల్‌పై‌ బడా నాయకులు స్పందించాలనీ కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News