Saturday, October 5, 2024
HomeతెలంగాణThangallaplli: రైతులు అప్రమత్తంగా ఉండాలి

Thangallaplli: రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాలు

జిల్లాలో ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడుతున్న సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు, బయటకు వెళ్లవద్దని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని శుక్రవారం తంగళ్లపల్లి ఎస్సై డి. సుధాకర్ అన్నారు. మాట్లాడుతూ నిన్నటి రోజున అకస్మాత్తుగా పిడుగులు పడడంతో జిల్లాలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, వర్షాలు కురుస్తున్న సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని ఈదురు గాలులకు విద్యుత్ తీగలు కూడా తెగి మీదపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. రైతులు కూడా వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు త్వరగా ఇంటికి చేరిలుకోవాలని సూచించారు. అంతేకాక వర్షాల దృష్ట్యా వాగులు, చెరువులు కుంటలు నిండుకుండ లాగా ఉంటాయి కావున చెరువులు, కుంటలు వద్దకు పిల్లలు, యువత ఎవరూ వెళ్ళొద్దన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం కు డయల్100 సమాచారం ఇవ్వాలని అయన కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News