Friday, November 22, 2024
HomeతెలంగాణTirumala: వెంకన్నను దర్శించుకున్న బిఆర్ఎస్ నాయకులు

Tirumala: వెంకన్నను దర్శించుకున్న బిఆర్ఎస్ నాయకులు

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి నిలయాలు అన్న నినాదంతో కెసీఆర్ జై తెలంగాణ నినాదాలతో బయల్దేరి ఎన్నో ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు కెసీఆర్ నేతృత్వంలో దేశమే తెలంగాణ వైపు చూసేలా ఎన్నో అభివృద్ధి పథకాలతో ముందుకెళ్లడమే కాకుండా దేశ చరిత్ర లోనే ఎక్కడ లేని విధంగా 125 అడుగుల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నూతన సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టారన్నారు. దేశంలోనే ఏ ప్రధానమంత్రి,ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయురారోగ్యాలతో ఉండి ఇంక ఉన్నత పదవులతో పేద ప్రజలకు మరింత సేవలందించాలని ఆ తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామినీ కోరుకున్నట్లు చెప్పారు.

- Advertisement -

ఏడుకొండల స్వామిని దర్శించుకున్న వారిలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, అరుణ్, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News