Tuesday, June 24, 2025
HomeతెలంగాణToday Rains: రేపటి నుంచి తగ్గుముఖం పట్టనున్న వర్షాలు.. ఈరోజు మాత్రం..!

Today Rains: రేపటి నుంచి తగ్గుముఖం పట్టనున్న వర్షాలు.. ఈరోజు మాత్రం..!

- Advertisement -

TG Weather updates: రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయని హైదరాబాద వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ ఈరోజు మాత్రం రాష్ట్రంలో మంచి వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు పేర్కొంది. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం వంటి ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా చిరు జల్లులు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో ఆకాశమంతా మేఘావృతమై, అడపాదడపా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

నేడు హైదరాబాద్ లో:

హైదరాబాద్ లో నేడు సాయంత్రం ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం నుండి మధ్యాహ్నం సమయంలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి.

  • హైదరాబాద వాతావరణ కేంద్రం.

గడిచిన 24 గంటల్లో:

నిన్న సాయంకాలం నుంచి తెల్లవారు జాము వరకు రాష్ట్రం లోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంచి వర్షపాతం నమోదు అయిందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నిన్నటిలాగే నేడు కూడా అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కొనసాగుతాయని పేర్కొంది.

జూన్ వర్షాలు.. వేసవిలోనే:


ప్రస్తుతం కురవాల్సిన వర్షాలు వేసవిలోనే కురిసాయని అందుకే ఇప్పుడు కురవడం లేదని ప్రజలు అంటున్నారు. ఎప్పుడు కురవాల్సిన వర్షాలు అప్పుడే కురిస్తేనే బాగుంటుందని అంటున్నారు. తీరా విత్తనాలు వేసే సమయాల్లో వర్షాలు పడకపోవడం రైతులకు బాధాకరం అని వాపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News