Sunday, September 15, 2024
Homeఓపన్ పేజ్Town planning is the key department: టౌన్‌ ప్లానింగ్‌-మెరుపులు.. మలుపులు, మరకలు

Town planning is the key department: టౌన్‌ ప్లానింగ్‌-మెరుపులు.. మలుపులు, మరకలు

ఇప్పుడు ఎవరి నోట విన్నా హైడ్రా.. హైడ్రా.. హైడ్రా అనే వినిపిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో బుల్డో జర్‌ బాబా అనే పేరు బాగా ఫేమస్‌ అయినట్లు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఇప్పుడు ఈ హైడ్రా పేరు మార్మోగి పోతోంది. అక్రమ నిర్మాణాల పాలిట విక్రమార్కుడిలా హైడ్రా కమిషనర్‌, ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ విరు చుకుపడుతున్నారు. ఇన్నాళ్ల పాటు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వేలేసి కూడా ముట్టుకోవడానికి ఆలోచించని, సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూడా ప్రొక్లెయినర్లు పెట్టి నిట్టనిలువునా కూల్చేశారు. ప్రగతినగర్‌ లాంటి ప్రాంతాల్లో కొన్ని అపార్టుమెంట్లు కూడా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయనో, లేదా బఫర్‌ జోన్‌లోకి వస్తాయనో చెప్పి వాటినీ కూల్చేశారు.
ఇదంతా నాణేనికి ఒకవైపు. రెండోవైపు తిప్పి చూస్తే, అసలు కూల్చివేతల వరకు వెళ్లడానికి ముందు పట్టణ ప్రణాళికా విభాగం ఏం చేస్తోంది? అర్బన్‌ ప్లానింగ్‌ అంటే ఒక నగరానికి సమగ్రరూపం ఇవ్వడమే కదా. అందులో భాగంగానే నగరంలో ఎక్కడ రోడ్లు రావాలి, ఎంత విస్తీ ర్ణంలో రావాలి, ఎక్కడెక్కడ నివాస ప్రాంతాలు ఉండాలి, ఎక్కడెక్కడ చెరువులు, ఇతర జలనవరులను సంరక్షించాలి, ఎక్కడ వాణిజ్య సముదాయాలు ఉంటే బాగుంటుంది, ఎక్కడ పార్కులు, పాఠశాలలు, ఆస్పత్రులు, కమ్యూనిటీ హాళ్లు.. ఇవన్నీ ఎలా ఉండాలి, పచ్చదనానికి ఎక్కడెక్కడ అవకాశం కల్పించగలం… ఇలాంటివన్నీ చూసుకోవా ల్సింది పట్టణ ప్రణాళికా విభాగం అధికారులే. నిజంగానే తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ లేదా బఫర్‌ జోన్‌ పరిధి లోకి ఎన్‌ కన్వెన్షన్‌ వస్తుంటే.. దాని నిర్మాణ సమయం నుంచి మొదలుపెట్టి, ఈ దశాబ్ద కాలం వరకు గాంధారీ అంధత్వాన్ని ఎందుకు పాటించినట్లు?
నిజానికి చండీగఢ్‌ లాంటి అద్భుతమైన నగరాలను స్విస్‌-ఫ్రెంచ్‌ ఆర్కిటెక్టు లీ కార్బూసియర్‌ లాంటి వాళ్లు రూపొందించారంటే ఆ నగరంలో అన్నీ ఎంచక్కా, పొం దిగ్గా, చక్కగా సర్దిపెట్టిన ఇంటిలా ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ లాంటి నగరాలు చూస్తే దాదాపు అన్నీ సమాంతర వీధులే కనిపిస్తాయి. ఒకవైపు అన్నీ సినిమా థియేటర్లు, మరోవైపు వస్త్రదుకాణాలు, ఇంకోవైపు బంగారు దుకాణాలు.. ఇలా ఏం కావాలన్నా సులభంగా తెలిసేవిధంగా ఉంటాయి. పట్టణ ప్రణాళిక విభాగం చేయాల్సిన పని అదే..
నిజానికి ఈ విభాగానికి అత్యంత గౌరవ మర్యాదలు కూడా ఉండేవి. నాలుగు దశాబ్దాల క్రితం వరకు ఒక పట్టణ ప్రణాళిక అధికారి ఒక జిల్లాకు లేదా పట్టణానికి బదిలీపై వచ్చినా, ఏదైనా ప్రత్యేక పరిపాలనా సంబంధ మైన సమావేశానికి ఆ జిల్లాకు హాజరయ్యేందుకు వచ్చినా కూడా.. ఆ సందర్భంలో సదరు ప్లానింగ్‌ ఆఫీసర్‌కు గౌర వంగా స్వాగతం పలకడానికి రైల్వే ప్లాట్‌ఫాం మీద ఏసీ కోచ్‌ బోగీ ముందు ఆయా జిల్లా కలెక్టర్‌ స్థాయి అధి కారులు స్వాగతం పలికేవారు. టౌన్‌ ప్లానర్లకు ఆ స్థాయి గౌరవ మర్యాదలు దక్కేవి. అదంతా ఘనమైన గతం.
సీన్‌ కట్‌ చేస్తే.. ఇప్పుడు ప్రతిరోజూ ఐఏఎస్‌లు, లేదా వాళ్లకంటే దిగువ స్థాయి అధికారులకు రోజువారీ రిపో ర్టింగ్‌ చేయడం, తమ మీద ఏవైనా ఆరోపణలు వస్తే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల విచారణ ఎదుర్కోవడం టౌన్‌ ప్లానర్లకు తప్పడం లేదు. అంతలా ఈ విభాగం దిగజారి పోయింది. ప్రణాళికాబద్ధమైన నగరాల రూపకల్పనకోసం నిర్దిష్టమైన బ్లూప్రింట్లను రూపొందిస్తూ అత్యున్నత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఈ విభాగం ఇప్పుడు ఇంతలా మసకబారిపోవడానికి కారణమేంటి? ఏదైనా నగరానికి ప్రణాళిక రూపొందించే ముందు.. దాదాపు ఒక శతాబ్ద కాలపు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అలాంటి భావి అవసరాలకు అనుగుణంగా ఆయా నగరాల్లో మౌలిక సదుపాయాలు, జోనింగ్‌ నిబంధనలు, పర్యావరణ అను కూల జీవన విధానాన్ని అత్యంత భద్రత ఉండేలా రూపొం దించమే ఈ టౌన్‌ ప్లానర్ల ప్రధాన విధి. కానీ, రాజకీయ నాయకుల ప్రాపకం కోసం పాకులాడే స్థాయికి క్రమంగా దిగజారిపోయారు. పట్టణ ప్రణాళికా విభాగం అంటే బంగారు గుడ్లు పెట్టే బాతు అనుకున్నారు. క్రమంగా కేవ లం భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే అధికారుల్లా మిగిలి పోయారు.
డబ్బు సంపాదనకు అలవాటు పడిన కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఈ విభాగం పరువును పూర్తిగా మంటగలిపారు. బాలకృష్ణ లాంటి కొంతమంది అయితే ఏకంగా వేల కోట్లు వెనకేసుకుని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణలో చిక్కారు. ఇలా చిక్కిన సొమ్ము లో అధికారికంగా లెక్కల్లో చూపించేది మార్కెట్‌ విలువ మాత్రమే. దాని బయట విలువ అంతకు నాలుగైదు రెట్లు ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. ఈ లెక్కన ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్న పట్టణ ప్రణాళికా విభాగం అధి కారుల సంపాదన ఎంతన్నది తెలిస్తే మనమంతా నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. ప్రధానంగా రాజకీయ నాయకుల ప్రమే యం పెరిగినప్పటి నుంచే ఈ విభాగంలో అవినీతి పెరి గిందని చెప్పక తప్పదు.
నేనా మధ్య ఓ ప్రముఖ ఇంగ్లీష్‌ పత్రికలో ప్రస్తుత హెచ్‌ఎండీఏ కమీషనర్‌ ఇంటర్వ్యూ చదివితే.. అందులో ఆయన ఓ విషయం చెప్పారు. హెచ్‌ఎండీఏలో ఇకపై భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫెకెట్లు త్వరితగతిన జారీచేస్తుందని ప్రకటించారు. వాస్తవానికి హెచ్‌ఎండీఏ యాక్ట్‌ ఎవరైనా చదివితే ఆ యాక్ట్‌లో వారు నిర్వర్తించా ల్సిన విద్యుక్త ధర్మానికి, వారు ఇప్పుడు చేస్తున్న పనికి ఏమాత్రం సంబంధం లేదనే విషయం తెలుస్తుంది. మెరు గైన సమాజం కోసం మెరుగైన ప్రణాళికలు రూపొందించే విషయంలో తలమునకలై ఉండాల్సిన ఈ విభాగం కేవలం భవన నిర్మాణ అనుమతులకే పరిమితం కావటమే విడ్డూరం.
నా పాతికేళ్ల జీహెచ్‌ఎంసీ (ఎంసీహెచ్‌) రిపోర్టింగ్‌ కెరీర్‌లో చూసిన అతి కొద్దిమంది నిజాయతీపరులైన టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల్లో దేవేందర్‌ రెడ్డి ఒకరు. అటువంటి దేవేందర్‌ రెడ్డిని కూడా రాజకీయ ఒత్తిళ్లు గాడి తప్పేలా చేశాయి. నెట్‌ నెట్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నందగిరి హిల్స్‌ లో చేపట్టిన నిర్మాణంలో జరిగిన ఉల్లంఘనలకు ఈ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఇచ్చిన సహాయ సహకారాలు ఎన లేనివని చెబుతారు. తాజాగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ విభాగం దీనిపై ప్రభుత్వానికి సమగ్రంగా నివేదిక అందించి, సహకరించిన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేసింది. అలా.. విజిలెన్స్‌ అధికారుల పరిశీలనలో దేవేందర్‌ రెడ్డిలాంటి విశిష్ఠ వ్య క్తుల పేర్లు రావటం నాలాంటి జర్నలిస్టులకే షాక్‌ ఇచ్చింది. ఇక్కడ ఆయన కచ్ఛితంగా ఏమైనా చేసి ఉంటే ఆయా ప్రభుత్వాధినేతల ఒత్తిళ్లకు తలొగ్గి చేసుండాలే కానీ మరోటి కాదని నాబోటివాళ్లకు అర్థమవుతోంది. ఇదే విధంగా గత ప్రభుత్వంలో గండిపేటలోనూ దేవేందర్‌ రెడ్డినే అడ్డంగా వాడుకుని ఓ మార్వాడీకి చెందిన నిర్మాణాలపై కూడా సదరు ప్రభుత్వాధినేత జులుం చేశారు. బీఆర్‌ఎస్‌ అధి కారాన్ని కోల్పోవడంతో ఎట్టకేలకు ఆ మార్వాడీ పెద్దమనిషి కోర్టును ఆశ్రయించి ఎలాగోలా బయటపడ్డారు.
మనదేశంలో పట్టణ ప్రణాళిక అనేది నగరాలు, పట్ట ణాలు, ఇతర ప్రాంతాల భౌతిక, సామాజిక, ఆర్థిక అభి వృద్ధిని రూపొందించడం. జనాభా పెరుగుదల, భూ విని యోగం, రవాణా, పర్యావరణ పరిస్థితులు, సామాజిక అవసరాలు, భవిష్యత్తు ధోరణుల విశ్లేషణ అన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. పట్ట ణాలు, నగరాల అభివృద్ధికి స్థిరమైన పద్ధతిలో మార్గ నిర్దేశం చేసేలా ప్రణాళికలు, విధా నాలు రూపొందించడమే ఈ విభాగం ప్రధాన లక్ష్యం. వీళ్లు ముఖ్యం గా భూ వినియోగం, రవాణా, మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, ఉద్యాన వనాలు, బహిరంగ ప్రదేశాలు, కమ్యూనిటీ సేవల కోసం ప్రణాళికలను రూపొం దించి, అవి పక్కాగా అమల య్యేలా చూడా లి. గృహ నిర్మాణం, ఆర్థికాభివృద్ధి, పర్యా వరణ సుస్థి రత సమస్య లను కూడా వీరే పరిష్కరిస్తారు. పట్టణ ప్రణాళిక అంతిమ లక్ష్యం వర్తమానంలోను, భవిష్యత్తులోను ఒక ప్రాంతంలో ఉండేవారందరి అవసరాలను తీర్చే నివాస యోగ్యమైన, ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందుతున్న సమా జాన్ని సృష్టించడం. ఆక్రమణలపై దృష్టి పెట్టిన రేవంత్‌ సర్కారు ఇక ముఖ్యమైన పట్టణ ప్రణాళికలపై దృష్టి సారిం చాల్సిన సమయం వచ్చింది. సీఎం కొత్తగా నిర్మిస్తానం టున్న కొత్త సిటీ నిర్మాణానికి మెరుగైన ప్రణాళికలు అవ సరం. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రణాళికలను కట్టు దిట్టంగా అమలు చేయాల్సిన అత్యవసరం.
ఒక నగరానికి లేదా పట్టణానికి రూపకల్పన చేసేట ప్పుడు, లేదా దాన్ని విస్తరించాలని పాలకులు భావించిన ప్పుడు ముందుగా అక్కడ అప్పటికే ఉన్న భూమి, భవ నాలు, రహదారులు, రవాణా సదుపాయాలు, డ్రైనేజి, తాగునీటి వసతులు, పార్కులు, ఉద్యానవనాలు, మౌలిక సదుపాయాలు, పర్యావరణం, వైద్య సదుపాయాలు, పాఠ శాలలు, జల వనరుల సంరక్షణ.. ఇలాంటి అనేక విషయా లను దృష్టిలో పెట్టుకోవాలి. దాంతోపాటు ముఖ్యంగా నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలు, బహిరంగ ప్రదే శాలు, ప్రజాప్రయోజన ప్రాంతాలు… ఇలా వివిధ ప్రాంతా లను వర్గీకరించుకుని, వాటికి జోనింగ్‌ చేసుకోవాలి. ఉదాహరణకు రెసిడెన్షియల్‌ జోన్‌ అంటే అక్కడ నివాస సముదాయాలు, వాటికి అనుగుణంగా మహా అయితే పాఠశాలలు, పార్కులు, దేవాలయాలు ఉండాలి తప్ప, అక్కడ భారీ వాణిజ్య సముదాయాలు గానీ, పారిశ్రామిక యూనిట్లు గానీ ఉండకూడదు, వాటికి ఆయా ప్రాంతాల్లో అనుమతులు ఇవ్వకూడదు. పట్టణాభివృద్ది విభాగం సామ ర్థ్యం అందులోనే బయటపడుతుంది. ఒక సమాజంలో నాణ్యమైన జీవన విధానాన్ని అందించడానికి అవసరమైన సుస్థిర పద్ధతులను అవలంబించడానికి వీలయ్యే వాతా వరణం సృష్టించడమే వీళ్ల ప్రధాన లక్ష్యం. ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా నగరాలు లేకపోతే అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. దీనికి నిలువెత్తు సాక్షమే చెన్నై, ముంబై, వయనాడ్‌ వరదల్లో జరిగిన అపారనష్టం.
సరిగ్గా ఇక్కడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు దృష్టిసారించాలి. తెలంగాణలో మొన్నమొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం ఈ విభాగాన్ని తమ కాలికింద చెప్పులా భావించింది. జోనింగ్‌ విధానాన్ని ఇష్టారాజ్యంగా మార్చే యడానికి పూనుకుంది. ఎక్కడ పడితే అక్కడ, ఏవి పడితే అవి నిర్మించుకునేలా అనుమతులు ఇప్పించ డానికి పట్టణ ప్రణాళికా విభాగం అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చింది. ప్రతి నగరానికి, పట్టణా నికి ఒక మాస్టర్‌ ప్లాన్‌ అనేది ఉంటుంది. దాని ప్రకారం ఉండే కన్జర్వేటివ్‌ జోన్‌ను యథాతథంగా ఉంచే యాలి తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలకు తావు ఇవ్వకూ డదు. కానీ, గత ప్రభుత్వంలో మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న కన్జర్వేటివ్‌ జోన్లను నివాస ప్రాంతాలుగా, నివాస ప్రాంతాలను వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలుగా ఎక్కడిక క్కడ ఎడాపెడా మార్పులు చేసి పారే శారు. ఇందుకోసం టౌన్‌ ప్లానర్ల మెడపై కత్తిపెట్టి మరీ పనిచేయించారు. మాస్టర్‌ ప్లాన్‌ 2031 రూపకల్పన తరువాత గత పదేళ్లలో జోనింగ్‌ మార్పులపై వెలువడిన ఉత్తర్వు లను ఓసారి సమీక్షిస్తే ఈ విష యం ఎవరికైనా ఇట్టే అర్థమవు తుంది. బాలకృష్ణ లాంటి అధికా రులు ఇక్కడే సొమ్ము చేసుకు న్నారు కూడా.
ఇలా ఒత్తిడి బారిన పడుతూ రాజకీయ చదరంగంలో పావులుగా మారిపోతూ విపరీతంగా అవినీతి కేసుల్లో ఇరుక్కోవడంతో పాటు.. నగరాల సుస్థిరతకే చేటు కలిగేలా వ్యవహరిస్తున్నారు ఈ ప్లానర్లు. అందుకే ఇక్కడ చెరువులు, కుంటలు, నాలాలు విపరీతంగా ఆక్రమణల బారిన పడ్డాయి. గతంలో నిజాంపేట ప్రాంతంలోని బం డారి లే అవుట్‌ అనే ప్రాంతం మొత్తం వర్షాలకు మునిగి పోయింది. నిజానికి ఆ లే అవుట్‌ను ఒక చెరువు మొత్తాన్ని పూడ్చేసి ఏర్పాటుచేశారు. చెరువు ప్రవాహమార్గాన్ని సైతం మూసేసి కట్టడం వల్ల నీళ్లు ఎటు పోవాలన్నది అర్థం కాక.. ఆ లే అవుట్‌ మొత్తాన్ని ముంచెత్తాయి. చార్‌ సౌ షహర్‌ అని ఘనంగా చెప్పుకొంటున్న హైదరాబాద్‌లో ఇలాంటి అక్ర మాలు, ఆక్రమణలు లెక్కలేనన్ని కనిపిస్తాయి.
అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల భరతం పట్టడానికి హైడ్రా అనే ప్రత్యేక విభాగాన్ని తెరపైకి తెచ్చి, ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని దానికి అధిపతిగా చేసి, ఆయన చేతికి ప్రొక్లయి నర్లు, బుల్డోజర్లు అప్పగించిందంటే.. పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ సమీక్షిం చుకోవాల్సిన విషయం ఏమిటంటే గతంలో జరిగిన కొన్ని తప్పులను సవరింపుల కోసం అంటూ ఎఫ్‌.టి.ఎల్‌., బఫర్‌ జోన్లలో ఆయా నిర్మాణాల కూల్చివేతలకే ప్రభుత్వం ప్రాధా న్యమిస్తే భవిష్యత్‌ నగర ప్రణాళిక మరుగున పడే ప్రమాదం ఉంది. మహానగరాన్ని వరద ముంపు నుంచి సంరక్షించ డానికి మాత్రమే హైడ్రా తెరపైకి వచ్చినట్టు చెబుతున్నారు. కానీ, ఈ లక్ష్య సాధనకు హైడ్రా ఏర్పాటు నిర్ణయం ఒక్కటే పరిష్కార మార్గం కాబోదు. సురక్షితమైన నగరానికి ఒక ముందస్తు ప్రణాళికాబద్ధమైన నగరం ఏర్పాటుకు ఒక స్పష్ట మైన పట్టణ ప్రణాళిక అవసరం. ఉమ్మడి రాష్ట్రం మొదలు ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరువాత కూడా మనం రూపొం దించుకున్న మాస్టర్‌ ప్లాన్లు ఆయా ప్రభుత్వాలు లేదా ప్రభు త్వాధినేతలు ఆయా సందర్భాల్లో వారికి అను కూలంగా కొన్ని వందలసార్లు మార్పులు, చేర్పులూ, కూర్పులు చేస్తూనే వస్తున్నారు.
ఇలా ధ్వంసమైన మాస్టర్‌ ప్లాన్‌కు తిరిగి జీవం పోసే లాంటి చర్యలు రేవంత్‌ సర్కారు చేపట్టినప్పుడే ఆయన సంకల్పం సంపూర్ణమవుతుంది. అప్పటివరకూ ఇది అసం పూర్ణమే. అరకొర సమాచారంతో, అరకొర పరిజ్ఞానంతో కొందరు నిపుణులు ఇచ్చిన సూచనలకే గత సర్కారు పెద్ద పీట వేసింది. బీవీ సుబ్బారావు లాంటి నిపుణులను పక్కన పెట్టి గత కేసీఆర్‌ ప్రభుత్వం ఆడిందే ఆట పాడిందే పాటగా నడిపించింది. చెరువుల పరిరక్షణపై సుబ్బారావులా అవ గాహన ఉన్న నిపుణులు తెలంగాణ రాష్ట్రంలో చాలా అరు దుగా ఉన్నారు. ఇప్పటికైనా అటువంటి మేధావి వర్గాన్ని పరిగణనలోకి తీసుకుని గతంలోనే వారిచ్చిన సూచనలు, సలహాలను ఓసారి సమీక్షిస్తే కాంగ్రెస్‌ సర్కారుకు మహా నగర సుస్థిరతపై ఓ స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. ఆ దిశగా ఈ సర్కార్‌ చర్యలు చేపడుతుందా? లేక కూల్చి వేతలకే ప్రాధాన్యం ఇచ్చి సుస్థిరమైన ప్రణాళికను పక్కన పెడుతుందా అనేది సమీప భవిష్యత్తులో తేలనుంది.
సమయమంత్రి చంద్రశేఖర శర్మ

  • 98858 09432
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News