YS Sharmila : వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. కొద్ది రోజుల క్రితం పోలీసులు బ్రేక్ వేయడంతో పాదయాత్ర ఆగిపోగా ఇప్పుడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మళ్లీ మొదలుకానుంది.
వరంగల్ జిల్లాలో పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని షర్మిల న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. కోర్టు అనుమతి ఇచ్చాక పోలీసులు ఎలా అనుమతి నిరాకరిస్తారు అని ప్రశ్నించింది. రాజకీయ నేతలు అందరూ పాదయాత్ర కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించింది. రాజ్‌భవన్ వద్ద వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రకు అనుమతి ఎందుకు నిరాకరించారని న్యాయస్థానం ప్రశ్నించగా షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంపై ఇలా వ్యాఖ్యానించడం సరికాదని న్యాయస్థానం షర్మిలకు సూచించింది. రాజకీయ నాయకుకలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సాధారమని హైకోర్టు అభిప్రాయపడింది. పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో గతంలో ఇచ్చిన షరతులు వస్తాయని పేర్కొంది.