నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్ బిసి టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ పనులు సాగుతుండగా పైకప్పు కూలి 8 మంది చిక్కుకున్నారు. నిన్నటి నుంచి మంత్రులు స్వయంగా ఈ సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. ప్రమాద ఘటనా స్థలంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ లు నిన్నటి నుంచే ఇక్కడే ఉండి పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

