యూనిమనీ ఇండియా బ్రాంచ్ ను హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ప్రారంభించారు. సీఏ కృష్ణన్ ఆర్, యునిమోని ఇండియా డైరెక్టర్, సీఈఓ, యునిమోని అధికారుల, ప్రముఖ అతిథులు, కస్టమర్ల సమక్షంలో శాఖను అధికారికంగా ప్రారంభించారు. మన్జో వి మాథ్యూ, సీఎఫ్ఓ, బి సతీష్ కుమార్, సీఓఓ, రతిష్ ఆర్, సీపీఓ, జాతీయ వ్యాపార హెడ్లు ప్రకాష్ భాస్కర్ (ఫారెక్స్), జాన్ జార్జ్ (ట్రావెల్ అండ్ హాలిడేస్), టైటస్ కే (గోల్డ్ లోన్) ఈ సమావేశంలో యునిమోని వ్యాపారం, కార్యకలాపాలపై ప్రసంగించారు.
ఈ కార్యక్రమాన్ని టీ శ్రీనివాస్ రెడ్డి (జోనల్ హెడ్ – ఆంధ్ర-తెలంగాణ), కే శ్రీనివాస్ (రీజనల్ హెడ్ – హైదరాబాద్), బి శ్రీకాంత్ (శాఖ హెడ్ – కుకట్పల్లి) నిర్వహించారు.
“మా కొత్త శాఖ మీ ఆర్థిక అవసరాలను అత్యుత్తమ సేవా ప్రమాణాలతో అందించడానికి మరింత సులభంగా, సౌకర్యవంతమైన అనభూతిని అందించేందుకు రూపొందించాం. విలువలతో కూడిన అంకిత భావం, దీర్ఘకాలిక సంబంధాలను నిర్మించడం, ఆర్థిక పరిష్కారాలను అపరమితంగా అందించడానికి ప్రయత్నిస్తాం” అని యునిమోని ఇండియా డైరెక్టర్-సీఈవో సీఏ కృష్ణన్ ఆర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివరించారు.
కూకట్పల్లిలో సీఎస్ఆర్..
ప్రారంభోత్సవంలో భాగంగా సీఎస్ఆర్ చర్యలో భాగంగా, యునిమోని కుకట్పల్లి శాఖ వాళ్ళు భువన విజయం ప్రాథమిక పాఠశాల విద్యార్థి విద్యార్ధులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసారు.
యునిమోని ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విదేశీ మారకం, ప్రయాణాలు, గోల్డ్ లోన్, ఇన్వర్డ్ మనీ ట్రాన్స్ఫఫర్, మరెన్నో ఇతర ఆర్థిక సేవలు అందిస్తోంది. యునిమోని, తన వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపై దృష్టి సారించి, ఆర్థిక సేవల రంగంలో విశ్వసనీయత, నాణ్యతను పెంచడానికి కృషి చేస్తోంది.
సీఎస్ఆర్ చర్యల ద్వారా, యునిమోని సమాజానికి తిరిగి ఇచ్చేందుకు ఎన్నో రూపాల్లో సేవా కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడుతోంది. విద్య, సామాజిక అభివృద్ధికి సహాయపడడం వంటి లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉంది.
యునిమోని ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆర్థిక సేవలలో మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతలలో కూడా తన పాత్రను గుర్తించి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది.