హెచ్‌సీయూ భూముల వేలంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ(HCU)లో ఉన్న 400 ఎకరాల భూమి వేలం ప్రక్రియను విరమించుకోవాలని కోరారు. వనరుల పేరిట పర్యావరణాన్ని నాశనం చేయడం మంచిది కాదని హితువు పలికారు. హెచ్‌సీయూలో 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీవ వైవిధ్యంతో కూడిన ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్లా మార్చవద్దని కిషన్ రెడ్డి కోరారు.అలాగే గతంలో ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకించిన రేవంత్ వ్యాఖ్యలను గుర్తుచేశారు.
కాగా ప్రభుత్వ ఆదాయం కోసం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వేలం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. ఈ భూముల్లో జింకలు, నెమళ్లు, వేలాది పక్షులు ఉన్నాయని వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. అయితే అసెంబ్లీలో దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ భూమిలో జంతువులు లేవని కొంతమంది గుంటనక్కలు కావాలనే ఇలా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.