Sunday, November 16, 2025
HomeతెలంగాణVeernapalli: వీర్నపల్లి మండలంలో కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శుల సమ్మె

Veernapalli: వీర్నపల్లి మండలంలో కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శుల సమ్మె

వీర్నపల్లి మండల పరిధిలోని 17 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద జెపిఎస్, ఓపియస్ ల శాంతియుత నిరవధిక సమ్మె తేది 28/04/2023 శుక్రవారం రోజు నుండి చేయడం జరుగుతోంది. ఈ సందర్బంగా సమ్మె చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ జెపిఎస్ లను రెగ్యులర్ చేస్తూ 4 సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించాలని ఓపిఎస్ లను జెపిఎస్ లుగా గుర్తిస్తూ రెగ్యులర్ చేయాలనీ, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పంచాయితీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ నిర్దారించి ప్రకటించాలి, విధి నిర్వహణలో భాగంగా మరణించిన కార్యదర్శుల కుటుంబాలకు ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టి వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రతతో పాటు కుటుంబానికి భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

మండల పంచాయతీ కార్యదర్శుల శిబిరాన్ని సందర్శించి తమ మద్దతు తెలిపిన వీర్నపల్లి మండల ఎంపిడిఓ బంగారి నరేష్ కుమార్, ఎపిఓ కొమురయ్య,టి ఏ లు నాగరాజు, అనిత ఉన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad