భారత జాతిపిత, మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన దేశ ప్రజల స్వేచ్ఛా వాయువుల కోసం చేసిన అలుపెరగని పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చింది అన్నారు. అహింసా మార్గంలో దేన్నైనా జయించవచ్చు అని నిరూపించిన గాంధేయ మార్గంలోనే కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కాంక్షకు అనుగుణంగా తెలంగాణలో కేసిఆర్ పాలన సాగుతోందని, మహాత్ముడి ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసిఆర్
పల్లెలను ఆర్దికంగా పరిపుష్టం చేస్తున్నారని అన్నారు.
గాంధీజీ సేవలు సదా స్మరనీయమని మహాత్మునికి మంత్రి వేముల జోహార్లు తెలిపారు. మంత్రి వెంట డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్డీవో వినోద్ కుమార్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.