Gold Rates: గోల్డ్, సిల్వర్ ధరలు ఇటీవల ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు అమెరికా ఫెడరల్ రిలీజ్ రేట్లను త్వరలో తగ్గించనుందనే అంచనాలతో పాటు డాలర్ కరెన్సీ బలహీనపడటం. ఈ రెండు కారణాలు ప్రస్తుతం ఆభరణాలు, విలువైన లోహాలకు అధిక డిమాండ్ క్రియేట్ చేస్తూ ధరలను రికార్డు స్థాయికి తీసుకువెళ్లాయి.
ఇంట్రాడేలో స్పాట్ మార్కెట్ (MCX)లో సెప్టెంబర్ 29, 2025న గోల్డ్ ఫ్యూచర్లు 1.2% పెరిగి రూ.1,15,253 చేరాయి. అలాగే డిసెంబర్ ఫ్యూచర్స్ కూడా ధరలు 1.1% పెరుగాయి. ఇదే సమయంలో మరో లోహం సిల్వర్ కూడా 1.6% స్థాయిలో పెరిగి రూ.1,44,179 చేరింది. అంతర్జాతీయంగా కూడా డిసెంబర్ డెలివరీ గోల్డ్ $3,837.72 ఔన్స్ కు చేరుకుంది.
ట్రేడర్లు ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అక్టోబర్ నెలలో 90%, డిసెంబరులో మరోసారి రేటు కోతపై నమ్మకంతో ఉన్నారు. ఫెడరల్ రిజర్వ్ అక్టోబర్ 28-29 తారీఖ్లలో ఈ విషయం మీద నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే అమెరికా ప్రభుత్వం మూసివేత వంటి పరిస్థితులు కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తుండగా.. ఈ అనిశ్చితులు బంగారు ధరల పెరుగుదలకు మద్ధతుగా నిలుస్తున్నాయి.
గోల్డ్ రేట్లను పెంచుతున్న ట్రంప్ నిర్ణయాలు..
గోల్డ్ సిల్వర్ రేట్లు వేగంగా పెరుగుతున్న ధరలకు ట్రంప్ అధ్యక్షుడి వరుస టారిఫ్ విధానాలు కారణంగా మారాయి. గోల్డ్, సిల్వర్ లాంటి విలువైన లోహాలు సాధారణంగా భద్రతా ఆస్తులుగా పరిగణింపబడతాయి. అందువల్ల ఆర్థిక ఒడిదొడుకులు, రాజకీయ కలహాల సమయంలో ప్రజలు వీటిపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ ఏడాది గోల్డ్ ధరలు సుమారు 50% వరకు పెరిగినప్పటికీ డిమాండ్ అస్సలు తగ్గటం లేదు. తాజాగా గతవారం చివర్లో ప్రకటించిన ఆటో, ఫార్మా, ఫర్నిచర్ సుంకాలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు.


