funny teacher student water bottle prank: పిల్లలతో కలిసి సరదాగా ప్రాంక్ చేయాలనుకున్న ఓ టీచర్ కు.. చివరికి తనే అందులో ఇరుక్కుపోయి తడిసి ముద్దైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ నవ్విస్తోంది. తరగతి గదిలో టీచర్ విద్యార్థుల మధ్య జరిగిన ఈ ఫన్నీ ఘటన అందరికీ నచ్చింది.
टेक्नॉलॉजी के नए दौर में ये मास्टरनी जी भी उलझ गए 😅 pic.twitter.com/DRkKYRvG7n
— सुनील चौधरी जोधपुर (@ErSunilGugarwal) September 14, 2025
పిల్లాడి అమాయకత్వం: ఈ మధ్య నీళ్ల సీసా కింద నాణేన్ని పెట్టి చేసే ప్రాంక్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది కదా. సరిగ్గా అలాంటి ఫ్రాంక్ వీడియో మరోటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక టీచర్ తన విద్యార్థితో చేయాలని ప్రయత్నించిన ఈ నీళ్ల సీసా ప్రాంక్ తెగ నవ్వులు పూయిస్తుంది. ఈ వీడియోలో టీచర్ తన డెస్క్ మీద కూర్చుని ఒక నీళ్ల బాటిల్ పట్టుకుని ఉంది. అమాయకంగా కనిపించే ఒక విద్యార్థి ఆమె ముందు నిలబడి ఉన్నాడు.
Also Read: https://teluguprabha.net/viral/viral-reels-youth-risk-lives-for-social-media-fame/
ఫన్నీ దృశ్యం: టీచర్ ఆ పిల్లవాడిని బాటిల్ లోపల చూడమని అడిగింది. నమ్మకంగా అతను బాటిల్ లోపలికి వంగి చుశాడు. పిల్లాడి అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న టీచర్.. వెంటనే బాటిల్‌ను గట్టిగా నొక్కేసింది. కానీ ఊహించని విధంగా.. బాటిల్ నుంచి నీరు విద్యార్థి ముఖం మీద పడటంతో పాటు టీచర్ ముఖం మీద కూడా పడ్డాయి. ఈ ఫన్నీ దృశ్యం చూసి తరగతిలోని మిగతా విద్యార్థులు పగలబడి నవ్వారు. టీచర్ కూడా నవ్వుతూ షాక్‌కు గురైంది. ఈ సరదా సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది.


