Indonesian Farmer Found Dead Inside Stomach Of Python: కొండచిలువలు మనుషులు మింగడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఇండోనేషియాలో చోటుచేసుకుంది. పొలం పనులకు వెళ్లిన రైతు ఎంతకీ తిరిగి రాకపోవడంతో..గాలింపు చర్యలలు చేపట్టిన కుటుంబసభ్యులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. 26 అడుగుల పొడవున్న కొండచిలువ కడుపులో అతడి మృతదేహం కనిపించడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన సౌత్ బుటోన్ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అసలేం జరిగిందంటే..
63 ఏళ్ల రైతు శుక్రవారం ఉదయం ఎప్పటిలానే పొలం పనులకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం మజపహిత్ గ్రామ శివారులో ఓ పెద్ద కొండచిలువ కదలలేని స్థితిలో కనిపించింది. అనుమానం చెందిన గ్రామస్థులు ఆ కొండ చిలువను చంపి దాని కడుపు చీల్చి చూశారు. అందులో రైతు డెడ్ బాడీ కనిపించడం చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ప్రాంతంలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి అని విపత్తు నిర్వహణ విభాగానికి చెందిన అధికారి లావొదే రిసావాల్ తెలిపారు.
View this post on Instagram
ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. భయంకరమైన పాములు ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. కొండచిలువలు విషరహిత పాములు. ఇవి చిన్న చిన్న జంతువులను మింగి ఆకలిని తీర్చుకుంటాయి. కొండచిలువలు మనుషులను తినడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 2017లో కూడా ఇండోనేషియాలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సులవేసీ ద్వీపంలో అక్బర్ అనే యువకుడిని కూడా ఇలాగే కొండచిలువ పొట్టన పెట్టుకుంది. అప్పుడు కూడా గ్రామస్థులు దానిని చంపి అతని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ తరహా కొండ చిలువలు ఎక్కువగా ఇండోనేషియా, ఫిలిప్ఫీన్స్ ల్లో కనిపిస్తాయి. తాజాగా జరిగిన సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Also Read: King Cobra Bathing video- కింగ్ కోబ్రా స్నానం వీడియో


