Sunday, November 16, 2025
Homeవైరల్Viral Video: ఏనుగు తొండంలో బీరు పోసిన వ్యక్తి.. సోషల్ మీడియాలో ఈ విషయంపైనే చర్చ

Viral Video: ఏనుగు తొండంలో బీరు పోసిన వ్యక్తి.. సోషల్ మీడియాలో ఈ విషయంపైనే చర్చ

Viral Video: అటవీ జంతువుల జీవన విధానాన్ని చూసేందుకు జనాలు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకోసమే, ప్రత్యేకంగా జంగిల్‌ సఫారీకి పర్యాటకులు వెళ్తుంటారు. అలా వెళ్లడమే కాకుండా, అక్కడి జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా తీస్తారు. అయితే, సరదాగా ఆడుకోవడం, చూడటం సంగతి పక్కన పెడితే.. కొందరు జంతువులకు ఏదో రకంగా చిరాకు, కోపం తెప్పించే పనులు చేస్తారు. దీంతో, వారు కూడా రిస్క్ లో పడుతుంటారు. అయితే, ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అలాంటి పని చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణుల అభయారణ్యంలో అతడు ఏనుగు తొండంలో బీరు పోసి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు చూద్దాం…

- Advertisement -

Read Also: Health Benefits: రోజూ ఉదయాన్నే యాపిల్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

కెన్యాలో జరిగిన ఘటన..

కెన్యాలోని ఒక స్పానిష్ పర్యాటకుడు వన్యప్రాణుల అభయారణ్యంలో ఏనుగు తొండంలో బీరు పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వీడియో గత సంవత్సరం లైకిపియా కౌంటీలోని ఓల్ జోగి కన్జర్వెన్సీలో రికార్డ్ చేసినట్లు తెలిసింది. కానీ, ఆ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏనుగు తొండంలో బీరు పోసిన స్పానిష్ పర్యాటకుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ వ్యక్తి ఏనుగు తొండంలో బీరు పోసి ఖడ్గమృగాలకు క్యారెట్లు తినిపిస్తున్నట్లు కనిపించింది. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఆఫ్రికన్ ఏనుగు ముందు బీరు తాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వాసనను పసిగట్టిన ఏనుగు బీరు డబ్బా కోసం తన తొండాన్ని చాపుతుంది. బీరును దూరంగా ఉంచడానికి బదులుగా, ఆ వ్యక్తి దానిని ఏనుగు తొండంలో పోస్తాడు. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతా నుండి వీడియోను తొలగించాడు. కానీ, అప్పటికే చాలా మంది దానిని షేర్ చేశారు. ఈ విషయం తీవ్రతను అర్థం చేసుకున్న కెన్యా.. అడవి జంతువులకు మద్యం పోసినందుకు నిందితుడిపై చర్యలకు సిద్ధపడింది. ఈ ఏనుగు వీడియోను @skydive_kenya అనే పర్యాటక బృందం షేర్ చేసింది.

Read Also: Mirai OTT Release: నెల తిరక్క ముందే ఓటీటీలోకి ‘మిరాయ్’.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఫేస్ బుక్ లో యాడ్ షేర్..

జూలై 29న వన్యప్రాణుల అభయారణ్యం తన ఫేస్‌బుక్ పేజీలో ఒక యాడ్‌ షేర్‌ చేసింది. అందులో ఆల్ జోగిలో సంవత్సరాలుగా నివసిస్తున్న బుప్ అనే ఏనుగుకు బీరు ఇచ్చాడని, అలాంటి చర్యలు ఆమోదయోగ్యం కావని పేర్కొంది. ఇలాంటి ఘటనలు ప్రమాదకరమైనవని, సంస్థ విలువలకు విరుద్ధమని వెల్లడించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, జంతువు శ్రేయస్సు, భద్రతను నిర్ధారిస్తామని స్పష్టం చేసింది. అటవీ ప్రాంతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగకూడదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జోగి కన్జర్వెన్సీ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad