Sunday, November 16, 2025
HomeTop StoriesMichingan Lottery: స్కామ్‌ కాల్‌ అనుకుంటే జాక్‌పాట్‌ తగిలింది.. 65 ఏళ్ల బామ్మ రూ. కోట్లకు...

Michingan Lottery: స్కామ్‌ కాల్‌ అనుకుంటే జాక్‌పాట్‌ తగిలింది.. 65 ఏళ్ల బామ్మ రూ. కోట్లకు అధిపతి

Lucky Draw Viral News Jackpot: జీవితంలో సెకండ్‌ ఛాన్స్‌ ఎంత విలువైందో 65 ఏళ్ల వాలెరీ విలియమ్స్‌ను చూస్తే అర్థమవుతుంది. మొదటి ప్రయత్నంలో విఫలమైతే రేపటిపై ఆశలు కోల్పోతారు కొంతమంది. మళ్లీ ప్రయత్నించడానికి వెనుకాడతారు. అయితే నచ్చిన పనిని మనం సవ్యంగా, ఫలితం ఆశించకుండా చేసుకుంటూ పోతూ విజయం మీ గుమ్మంలో వచ్చి వాలుతుంది. అలా వాలెరీ విలియమ్స్‌ ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యారు.

- Advertisement -

అమెరికాలోని మిచ్‌గావ్‌లో 65ఏళ్ల వృద్ధురాలు వాలెరీ విలియమ్స్‌ రాత్రికి రాత్రే కోటీశ్వురాలైంది. ఈ లేట్‌ ఏజ్‌లో ఆమె అదృష్టాన్ని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. స్కామ్‌ కాల్‌ అని లైట్‌ తీసుకున్న ఆమెను.. ఇప్పుడు దాదాపు రూ. 9 కోట్లు గెలుచుకునేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

మిచిగాన్‌లోని వెస్ట్‌ల్యాండ్‌కు చెందిన వాలెరీ విలియమ్స్ చాలాకాలంగా లాటరీ టికెట్లు కొంటున్నా.. ఏనాడు ఆమె పేరు డ్రాలో రాలేదు. అయితే ఆమె తనకు బహుమతి రాని టికెట్లను మిచిగాన్ లాటరీ యాప్‌లో స్కాన్ చేస్తూ ఉండేది. అయితే, అలా స్కాన్ చేసిన ప్రతి టికెట్ ఆటోమేటిక్‌గా సెకండ్ ఛాన్స్ డ్రాకు వెళుతుందన్న విషయం ఆమెకు తెలియకపోవడంతో ఆశలు వదులుకుంది. దీంతో ప్రతి రోజూ రోజువారీ పనుల్లో ఉండిపోయేది.

Also Read: https://teluguprabha.net/viral/son-protects-while-mother-sleeping-in-kolkata-metro-viral-video/

ఈ క్రమంలో ఇటీవల వాలేరీ విలియమ్స్‌కు మిచిగావ్‌ లాటరీ ఆఫీస్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. వాలెరీ ఒక మిలియన్ డాలర్లు(రూ. 8.8 కోట్లు) గెలుచుకున్నట్లు అవతలి వ్యక్తి చెప్పగానే.. తాను మొదటగా నమ్మలేదని చెప్పింది. ఇదేదో స్కామ్ అయి ఉంటుందని భావించి మొదట పట్టించుకోలేదని.. కానీ, ఏం చెబుతారో చూద్దామని ఫోన్ మాట్లాడినట్లు తెలిపింది. తాను ఏకంగా 1 మిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ గివ్‌అవే పోటీకి ఎంపికైనట్లు తెలిసి షాక్‌ అయినట్లు వివరించింది. 

ఆ తర్వాత సెప్టెంబర్ 19న డెట్రాయిట్‌లోని కొమెరికా పార్క్‌లో ప్రైజ్ వీల్ తిప్పేందుకు తనను ఆహ్వానించినట్లు వాలెరీ తెలిపింది. ఆ చక్రం తిరుగుతున్నప్పుడు చాలా ఉత్కంఠగా అనిపించిందని, చివరికి అది తాను ఎంచుకున్న రంగుపై ఆగడంతో నమ్మలేకపోయానని హర్షం వ్యక్తం చేసింది. కాగా, వాలేరీ తాను గెలుచుకున్న డబ్బును సేవింగ్స్‌ చేస్తానని.. త్వరలోనే తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్లు మనసులోని కోరికను తెలిపింది. 

Also Read: https://teluguprabha.net/national-news/pm-modi-farmer-schemes-42000-crores-2025-dhan-dhan-kisan-yojana/

వాలెరీ గెలుపుపై లాటరీ కమిషనర్ సుజాన్నా ష్రెలీ ఆమెకు అభినందనలు తెలిపారు. లాటరీ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ సెకండ్ ఛాన్స్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏది ఏమైనా 65 ఏళ్ల వయసులో కోటీశ్వరురాలు కావడం అంటే ఆశ్చర్యమేనంటూ నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad