Sunday, November 16, 2025
Homeవైరల్Viral news: మేనత్తతో ఎఫైర్.. చితకొట్టి ఆమెతోనే పెళ్లి చేసిన బంధువులు..వీడియో ఇదిగో!

Viral news: మేనత్తతో ఎఫైర్.. చితకొట్టి ఆమెతోనే పెళ్లి చేసిన బంధువులు..వీడియో ఇదిగో!

Shocking Incident In Bihar: మేనత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని పొట్టు పొట్టున కొట్టారు ఆమె బంధువులు. అంతేకాకుండా చివరకు అతనితోనే ఆమె పెళ్లి జరిపించారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని సుపాల్ జిల్లా భీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే..
జీవచ్ఛాపూర్‌కు చెందిన శివచంద్ర ముఖియా, రీటా దేవి భార్యభర్తలు. వీరి మేనల్లుడు మిథిలేశ్ కుమార్ ముఖియా(24). అయితే మేనత్తతో ఎఫైర్ పెట్టుకున్నాడనే కారణంతో మిథిలేశ్ ను జూలై 2 కిడ్నాప్ చేసి శివచంద్ర ఇంటికి తీసుకొచ్చారు వారి బంధువులు. అక్కడే శివచంద్రతో పాటు మరికొందరు గ్రామస్థులు మిథిలేశ్ పై కర్రలతో దాడికి పాల్పడ్డారు. అనంతరం రీటా దేవిని అక్కడికి తీసుకొచ్చి అతడితో బలవంతంగా సింధూరం పెట్టించి పెళ్లి జరిపించారు. అడ్డుకోబోయిన మిథిలేశ్ తల్లిదండ్రులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మిథిలేశ్ వీపు, మెడ, చేతులపై గాయాలైనట్లు తెలుస్తోంది.

స్థానికుల సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఇంతలోనే నిందితులు పరారయ్యారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు శివచంద్ర ముఖియాతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు భీంపూర్ ఎస్‌హెచ్‌ఓ మిథిలేశ్ పాండే పేర్కొన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మిథిలేశ్‌ను తొలుత నర్పత్‌గంజ్ హాస్పిటల్ కు, అక్కడ పరిస్థితి విషమించడంతో అరారియా సదర్ దవాఖానుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad