Crocodile Viral Video: మెుసలికి నీటిలో వెయ్యి ఏనుగుల బలం కలిగి ఉంటుంది. అందుకే మకరం నీటిలో ఉన్నప్పుడు ఎవ్వరూ అందులోకి దిగేందుకు సాహసించరు. నీటిలో మెుసలిని మించిన ప్రమాదకారి ఏది ఉండదు. అలాంటి మెుసలితోనే తాజాగా ఓ వ్యక్తి ఆటాడుకున్నాడు. ఏకంగా తన నోటితో మెుసలికి మాంసం తినిపించి అందరినీ షాక్ కు గురిచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వీడియోలోకి వెళ్తే.. ఒక నీటి మడుగులో భారీ మెుసలి ఉంటుంది. ఇంతలో సడన్ గా ఓ వ్యక్తి ఆ నీటిలోకి దిగుతాడు. అతడు ఓ పెద్ద మాంసం ముక్కను తెచ్చి తన నోటితో మెుసలికిచ్చే ప్రయత్నం చేస్తాడు. అది కూడా ఆ వ్యక్తిని ఏమి చేయకుండా దానిని అందుకుని తింటుంది. తర్వాత ఆ మకరాన్నిపట్టుకుని ఆటలాడతాడు. అంటే వీడియోను బట్టి చూస్తే ఇది పెంచుకునే మెుసలిని అర్థం అవుతోంది.
ఈ వీడియోను ‘డామ్ నేచర్ యు స్కేరీ’ అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా.. అది కాస్త ట్రెండ్ అయింది. దీనిపై వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. చాలా మంది ఈ వీడియోపై మిక్సడ్ కామెంట్స్ చేస్తున్నారు. మెుసలితో ఆడటం చాలా ప్రమాదకరమని కొందరు అంటే..బుర్రలేని వాళ్లే ఇలాంటి పనిచేస్తారని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: Viral Video -బైక్ పై 40 ఏళ్ల వ్యక్తితో పాతికేళ్ల అమ్మాయి రొమాన్స్.. వైరల్ గా వీడియో..
మెుసళ్లు అనేవి సరీసృపాలు. ఇవి డైనోసార్ ల కాలం నుండి జీవిస్తున్నాయి. ఈ వాతావరణ మార్పులకు ఎన్నో జీవులు అంతరించినప్పటికీ మెుసళ్లు జాతి మాత్రం వాటిని తట్టుకుని నిలబడింది. దానికి కారణం మెుసలి యెుక్క శరీర నిర్మాణమే. ఇది నీటిలో వేగంగా కదలి ఎలాంటి జంతువునైనా సులుభంగా వేటాడుతోంది. వీటి దవడలు చాలా బలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటి పళ్లు పదునైన రంపాల్లా ఉంటాయి. మెుసళ్లకు మనదేశంలో ఒడిశాలోని బితర్కనికా నేషనల్ పార్క్ చాలా ఫేమస్. ఎలిగేటర్లు, ఘరియల్, ఘగ్గర్ వంటి జాతులు మెుసళ్లలో ఉన్నాయి.


