Sunday, November 16, 2025
Homeవైరల్Viral Video: పిచ్చి పీక్స్‌! అమ్మాయిని కౌగిలించుకొని.. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి..

Viral Video: పిచ్చి పీక్స్‌! అమ్మాయిని కౌగిలించుకొని.. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి..

- Advertisement -

Couple’s Risky Reels Stunt viral: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి యువత చేస్తున్న చేష్టలు హద్దు అదుపు లేకుండా పోతున్నాయి. లైక్స్, వ్యూస్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. రీల్స్ మోజులో పడి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు రాత్రికి రాత్రి స్టారే అయిపోవాలని లైఫ్ ను రిస్క్ చేసి మరి స్టంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు పొగోట్టుకోవడమే కాకుండా కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఒక ప్రేమ జంటకు రీల్స్ పిచ్చి బాగా పీక్స్ కు చేరింది. దాంతో వారు ఎలాగైనా పాపులారిటీ సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఎవ్వరూ చేయని సాహసానికి పూనుకున్నారు. ఈ ప్రేమికులు ఇద్దరూ బ్రిడ్జిపైన కౌగిలించుకుంటూ రీల్ కోసం ఒక్కసారిగా కాలువలోకి దూకేస్తారు. వారు బతికారో చచ్చారో అనే విషయాన్ని వీడియోలో చూపించలేదు. తాజా వీడియో వైరల్ అవ్వడంతో దానిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఫేమస్ అవ్వడానికి ప్రాణాలను పణంగా పెట్టడం ఏంటంటూ వారు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.

వ్యసనంగా సోషల్ మీడియా

మద్యం, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కు బానిసలుగా మారినవారు దాన్ని ఎలా వదులుకోలేకపోతున్నారో… ఇప్పుడు సోషల్ మీడియాకు బానిసగా మారిన వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఎదుటివారిని చూసి మనం కూడా అలా గుర్తింపు తెచ్చుకోవాలని తెగ ఉవ్విళూర్లుతున్నారు. దాని కోసం ఏం చేయడానికి వెనుకాడట లేదు. రీల్స్, షార్ట్స్ కోసం రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. ఎత్తైన ప్రదేశం నుంచి దూకడం, బైక్స్ మరియు కార్లతో ఎవ్వరూ చేయని స్టంట్స్ చేయడం, అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం, బూతులు మాట్లాడటం ఇవన్నీ ఇలాంటి కోవకే చెందుతాయి. పోస్ట్ చేసిన ఫోటోలకు, వీడియోలకు లైక్స్ రాకపోతే ప్రాణాలు తీసుకునే వారు కూడా ఉన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరుచుకోండి..సోషల్ మీడియాను అవసరం కోసం వాడండి తప్ప ఇలా దానికి బానిసలు అయిపోయి ప్రాణాలు మీదకు తెచ్చుకోండి.

Also read: Rare video – నాగుపాము గుడ్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో..

 

 

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad