Sunday, November 16, 2025
Homeవైరల్Rare Nagamani video: అరుదైన నీలిరంగు నాగమణిని ధరించిన నాగుపాము, వీడియో వైరల్

Rare Nagamani video: అరుదైన నీలిరంగు నాగమణిని ధరించిన నాగుపాము, వీడియో వైరల్

Orgninal Nagamani Video: మన దేశంలో నాగులకు దైవత్వం ఉందని చాలా మంది నమ్ముతారు. అంతేకాకుండా వీటికి గుడులు కట్టి పూజలు కూడా చేస్తారు. నాగులను కొలవడానికి ప్రతి ఏటా రెండు పండుగలను కూడా జరుపుకుంటారు. అవే నాగుల చవితి, నాగుల పంచమి. ఈ రెండు పర్వదినాల్లో భక్తులు పుట్ట వద్దకు వెళ్లి నాగదేవతకు పూజలు చేస్తారు. అయితే ఈ నాగుల గురించి పురాణాల్లో కూడా చెప్పబడింది. ఈ భూమండలాన్ని ఆదిశేషుడు నాగు తన తలపై మోస్తుందని, పరమశివుడు మెడలో వాసుకీ అనే సర్పం ఉంటుందని, మహాభారతంలో తక్షకుడు అనే నాగు కీలకపాత్ర పోషించిందని వివరించారు.

- Advertisement -

పాములు గురించే కాదు నాగమణులు గురించి కూడా పురాణ కథల్లో ప్రస్తావించారు. ఈ నాగమణి ధరిస్తే మనకు తిరుగుండదని, ఏది అనుకుంటే అది జరుగుతుందని.. ఇలా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అప్పట్లో రాజులు విజయం కోసం ఈ నాగరత్నాలను ఉంగరాలతోపాటు చేతులకు ధరించేవారని ఒక నమ్మకం ఉండేది. పూర్వ యుగం నుండి ఆధునిక యుగం వరకు ఈ నాగమణుల కోసం పాములను విచక్షరహితంగా చంపుతున్న ఘటనలు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నాగరత్నాల్లో చాలా రకాలే ఉన్నాయి. తాజాగా ఓ నాగుపాము నీలిరంగు నాగమణిని ధరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read:  Viral Video – అంకుల్ మామూలోడు కాదు.. ఏకంగా కింగ్ కోబ్రాకే లిప్ కిస్ ఇచ్చాడు..

ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో ఓ కింగ్ కోబ్రా తలపై భాగంలో నీలిరంగు నాగరత్నాన్ని ధరించి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయితే ఎంతలా కదులుతున్న ఆ నాగమణి తల నుండి జారిపోకుండా ఉండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ పామును దగ్గర నుండి వీడియో తీసినప్పటికీ ఆ వ్యక్తులపై దాడి చేయకపోవడం విశేషం. నీలి రంగు నాగమణి కనిపించడం చాలా అరుదు. మిల మిల మెరుస్తున్న ఈ రేర్ నాగవజ్రాన్ని చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఈ వీడియోకు వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad