World’s tallest hotel in Dubai: ప్రపంచంలోనే ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీపాను నిర్మించి షాకిచ్చిన దుబాయ్.. ఇప్పుడు వరల్డ్ లోనే అత్యంత ఎత్తైన హోటల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. సీల్ దుబాయ్ మెరీనా పేరుతో 1,197 అడుగుల (365 మీటర్లు) ఎత్తుతో దీన్ని నిర్మిస్తోంది. ఇది ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది. ఇది ఇప్పటికే దుబాయ్ లో అతి ఎత్తులో ఉన్న హోటల్ గా పిలువబడుతున్న గెవోరా హోటల్(356 మీటర్లు)ను సెకండ్ స్థానానికి నెట్టివేయనుంది.
సీల్ దుబాయ్ మెరీనా ప్రత్యేకతలివే..
సీల్ దుబాయ్ మెరీనాను ‘ది ఫస్ట్ గ్రూప్’ సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో 82 అంతస్తులు, 147 సూట్‌లతో సహా సుమారు 1,004 రూమ్స్ ఉంటాయి. వీటిని ఫేమస్ NORR గ్రూప్ రూపొందించింది. దీనికి డిజైన్ ఇచ్చింది యహ్య జాన్. సీఆర్ 18వ బ్యూరో గ్రూప్ ఆఫ్ దుబాయ్ (CR18BG) ప్రకారం, హోటల్ సీల్ దుబాయ్ మెరీనా 12 అంతస్తుల ‘ఏట్రియం స్కై గార్డెన్’, 1,158 అడుగుల ఎత్తైన ‘స్కై రెస్టారెంట్’, భూమి నుంచి 1,004 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన ఇన్ఫినిటీ పూల్‌ను కూడా కలిగి ఉంది. ఇక, నేల నుంచి పైకప్పు వరకు ఉన్న గాజు కిటికీలు అతిథులకు 360 డిగ్రీల వ్యూను అందిస్తాయి. టట్టు స్కై లాంజ్ 81వ అంతస్తులో, టట్టు స్కై పూల్ 76వ అంతస్తులో మరియు టట్టు రెస్టారెంట్ సీల్ యొక్క 74వ స్థాయిలో ఉంటుందని సమాచారం.
దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేవి చమురు బావులు, ఒంటెలు. ఈ పెట్రోలియం, సహజ వాయువు నిక్షేపాల కారణంగా గల్ఫ్ దేశాలు సంపన్నం అయ్యాయి. ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులు నివశిస్తున్న దేశాల్లో దుబాయ్ కూడా ఒకటి. ఇక్కడ 828 మీటర్ల ఎత్తైన బుర్జ్ ఖలీపా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రజలు ఎంతో లగ్జరీగా జీవిస్తారు. దుబాయ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, లగ్జరీ రిసార్టుకు పెట్టింది పేరు. దుబాయ్ ఎయిర్ పోర్ట్ వరల్డ్ లోనే రద్దీగా ఉన్న ఎయిరుపోర్టుల్లో ఒకటి.


