Saturday, May 10, 2025
Homeఇంటర్నేషనల్China: భారత్‌- పాకిస్థాన్‌ ఉద్రిక్తతలు.. చైనా కీలక ప్రకటన

China: భారత్‌- పాకిస్థాన్‌ ఉద్రిక్తతలు.. చైనా కీలక ప్రకటన

భారత్‌- పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతల నెలకొన్న నేపథ్యంలో చైనా(China) కీలక ప్రకటన చేసింది. ఇరుదేశాలు సంయమని పాటించాలని చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌- పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని పేర్కొంది. శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు సమయమనం పాటించాలని కోరుతున్నామని తెలిపింది. శాంతియుత మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉద్రిక్తతలను తగ్గించాలని అంతర్జాతీయ సమాజం కూడా ఆశిస్తోందని వెల్లడించింది. ఈ సమస్య ముగింపునకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటనలో వెల్లడించింది.

- Advertisement -

మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco rubio) కూడా భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రూబియో సూచించారు. ఉద్రిక్తతల ముగింపునకు చర్చలు జరపాలని.. అందుకు అమెరికా పూర్తి సాయం అందిస్తుందని తెలిపారు. అలాగే భారత్‌-పాక్‌లు సంయమనం పాటించాలని జీ7 దేశాలు పిలుపునిచ్చాయి. పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని, శాంతిస్థాపన కోసం ఇరుదేశాలు చర్చలు జరపాలని ప్రతిపాదించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News