ఆయన ఒక సామాన్య వ్యక్తి. గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుండి ఇళ్ళు కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. పంచాయతీ వున్నప్పుడు నుండి పురపాలక సంఘంగా మార్పు చెందిన నేటి వరకు పన్నులు కడుతున్నారు. అయితే పట్టణం అభివృద్ధి చెందటం వల్ల తన ఇంటి ముందు ఖాళీ స్థలం రోడ్డుకు ఖాళీగా ఉండటంతో ఇతరులు బంకులు వేసుకొని తాను ఇంటికి వెళ్లకుండా అడ్డంగా పెట్టారు. అయితే అతను ఇంటికి వెళ్లేందుకు అడ్డంగా బంకులు ఉన్నాయని వాటిని తొలగించాలని మున్సిపల్ అధికారులను వేసుకున్న పట్టించుకోవడం లేదని బాధితుడు ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నందికొట్కూరు పట్టణానికి చెందిన మేధారి ఎల్లయ్య అనే వ్యక్తి దాదాపు 25 ఏళ్ళ క్రితం అల్లూరు రోడ్డులో ఇళ్ళు కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే రోడ్డుకు పక్కనే ఇళ్ళు ఉండటం వల్ల రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. ఆయన ఇళ్ళు రోడ్డుకు దగ్గరలో ఉండటం వల్ల రోడ్డుకు సమీపంలో ఎల్లయ్య ఇంటి ముందుగా బంకులు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఆ బంకులు అడ్డంగా ఉండటంతో ఇంటికి వెళ్లేందుకు రోడ్డే లేకుండా పోయిందని బాధిత ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు ఉన్న ఇంటికి పన్నులు అన్ని చెల్లిస్తున్నానని అయితే నాకు అక్రమంగా ఆక్రమించుకొని వ్యాపారాలు చేసుకుంటున్న వారిని తొలగించాలని మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్న ఏ అధికారి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణకు గురైన రోడ్డు ను కాపాడి నా ఇంటికి దారి చూపాలని బాధితుడు ఎల్లయ్య కోరుతున్నారు.
Nandikotkuru: నా ఇంటికి దారి చూపండి సార్ !
అధికారులు పట్టించుకోకపోవటంతో..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES