ఓటుకు నోటిస్తాం..అది కూడా ఒక ఓటుకు 6,000 రూపాయలిస్తాం అంటూ ప్రకటించి చిక్కుల్లో పడ్డారు కర్నాటక మాజీ మంత్రి, బీజేపీ నేత రమేష్ ఝార్కోలి. అయితే రమేష్ మాటలతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు నిత్యం హోరాహోరీగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీంతో కన్నడ ప్రజలు ప్రతిరోజు చిత్ర విచిత్రమైన హామీలు, కామెంట్లు వింటున్నారు. కాగా బీజేపీ, రమేష్ ఇద్దరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ ను కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది.