Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Pamulapadu: డ్రైనేజీ ముందు మధ్యాహ్నం భోజనం!

Pamulapadu: డ్రైనేజీ ముందు మధ్యాహ్నం భోజనం!

అంగన్ వాడి సెంటర్ ముందు పారిశుద్ధ్య లోపం

నంద్యాల జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో అంగన్వాడి సెంటర్ 1 వద్ద డ్రైనేజీ మురికిని రోడ్డుపై కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న వాటిని పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. అంగన్వాడీ టీచర్లు అధికారులకు తెలియజేసిన వాటిని రోడ్డుపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. కానీ రోడ్డుపై ఉన్న మురికిని తొలగించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రైనేజీ లోపం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి అనారోగ్యాలకు గురి అవుతున్నారు. అంగన్వాడి సెంటర్ వద్ద విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్న పక్కన మురికితో రోడ్డుపై డ్రైనేజీతో ఏర్పడింది. గ్రామాలలో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను గుర్తించి వాటిని తొలగించే విధంగా గ్రామాలలో సమస్యలు తెలుసుకునే విధంగా అధికారులను సచివాలయంలో ఉంచారు. అయితే గ్రామాల్లో వాటిని పట్టించుకునే నాధుడు కరువయ్యాడని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ నుంచి క్రింది సాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరికి డ్రైనేజీ సమస్యల గురించి, ప్రతిరోజు మీటింగ్ ద్వారా తెలియజేస్తూ ఉన్న, వాటిని అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు అధికారులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు అంగన్వాడి సెంటర్ కు మొదలుకొని, పై స్థాయి తరగతి వెళ్లే వరకు తల్లిదండ్రులు విద్యాభివృద్ధిలో నేర్పించాలి అనే సంకల్పంతో తల్లిదండ్రులు అంగన్వాడి సెంటర్లకు పంపిస్తున్నారు. గ్రామంలో ఉండే రోడ్డుపై ఉండే మురికి డ్రైనేజీ చూసి కూడా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఉన్న మురికి వెంటనే తొలగించి, పిల్లలు డెంగ్యూ , మలేరియా , టైఫాయిడ్ అనారోగ్యాల బారిన పడకుండా కాపాడాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News