Wednesday, February 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Actress Shraddha: శ్రీవారి సుప్రభాత సేవలో నటి శ్రద్ధ శ్రీనాథ్

Actress Shraddha: శ్రీవారి సుప్రభాత సేవలో నటి శ్రద్ధ శ్రీనాథ్

- Advertisement -

శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. ఆ ఏడుకొండల వారిని ప్రముఖ సినీ నటి శ్రద్ధ శ్రీనాథ్ దర్శించుకున్నారు. అదివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగ నాయకుల మండలంలో వేద పండితులు వేదశీర్వచనం అందించారు. శ్రీ వారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రద్ద మాట్లాడుతూ వెంకన్నను దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. తనని ఆదరిస్తున్న ప్రతి అభిమానికి కృతజ్ఞతలు తెలిపారు. పలువురు నటి శ్రద్దతో కలిసి ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.

2019 లో విడుదలైన జెర్సీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో నానికి పోటీగా నటించి మెప్పించారు. అనంతరం వరుస ఆఫర్ లు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు శ్రద్ధ శ్రీనాథ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అదే ఏడాది పింక్ తమిళ భాషా రీమేక్ మేర్కొండ పార్వై సినిమాలో అజిత్ తో నటించి మంచి నటీమణిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అప్పటి నుంచి అనేక తమిళ, తెలుగు, కన్నడ సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 2015 లోనే కోహినూర్ అనే మలయాళీ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు ఈమె. రెండేళ్ల అనంతరం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మంచి పాత్రలను పోషించారు. ఇక రీసెంట్ గా విడుదలైన మెకానిక్ రాకీ మూవీలో నెగిటివ్ రోల్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. వావ్ లేడీ విలన్ అన్నట్లు నటించారు. బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో సైతం ఓ పాత్ర పోషించి ప్రేక్షకుల కంట కన్నీళ్లు పెట్టించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News