పాఠశాల అంటే బ్యాగ్ వేసుకొని పోవడం.. పలకలో రుద్దడం…ఆ దశ నుండి ముందడుగు వేసి అప్పుడప్పుడే జ్ఞానోదయం కలిగి హైస్కూల్ లో అడుగు…చదువు…ఆటలు..చిలిపి చేష్టలు..ఒకరికొకరు దూషణలు..ఆ లోపు పది పబ్లిక్ పరీక్షలు..ఐదు ఏళ్లపాటు కలిసి ఉన్న వారు హటాత్తుగా తలో దిక్కు…ఆ తర్వాత కెరీర్ పై దృష్టి…సంసారం.. ఒత్తిళ్లు…ఇదే జీవితం కాదు,చిన్ననాటి స్నేహితులతో ఉండే మాధుర్యం వెలకట్టలేనిది గుర్తించి 20 ఏళ్ల తర్వాత విడిపోయిన స్నేహితులు మరల కలుసుకున్నారు.
వివరాల్లోకి వెళ్ళితే పట్టణంలోని సెయింట్ ఆంథోనీ ఉన్నత పాఠశాలలో 2004_05 సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు మంగళవారం సమ్మేళనం నిర్వహించారు.ముందుగా పాఠశాల కరస్పాండెంట్, ఫాదర్ జార్జ్, డేవిడ్ ఫాదర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. 20 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు కలవడంతో ముఖంపై చిరునవ్వుతో ఆప్యాయతగా పలకరించుకున్నారు.
పాత జ్ఞాపకాలను నెమరేసుకొని తమకు పెట్టిన అడ్డ పేర్లు గుర్తుచేసుకున్నారు.అనంతరం విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులు కేశవయ్య, మారెన్న, చిన్నప్ప, ప్రతాప్ రెడ్డి, థామస్, శాంత గ్రేస్, శామ్యూల్ లను పూలమాల, శాలువాతో సత్కరించి మెమోంటోలను అందజేశారు.
కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విష్ణు, యువరాజ్, హేమాద్రి, రాజు, నాగరాజు, అశోక్, రాజేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.